Liquor Transport Van | లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం.. వీడియో
Liquor Transport Van | శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు (Chittoor) నుంచి కార్వేటి నగరం మండాలనికి ఓ వ్యాన్‌లో మద్యం (Liquor Transport Van) తరిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద వ్యాన్ టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది.
Liquor Transport Van | త్రినేత్ర.న్యూస్: ఉచితంగా వస్తుందంటే మనం దేన్నైనా వదిలేస్తామా. మనకు అవసరం లేకపోయినా జేబులు, సంచులు, బస్తాల్లో కుక్కుకుని అందినకాడికి తీసుకెళ్తాం. అలాగే వీళ్లు కూడా. అందులోనూ అది మద్యం.. ఊరుకుంటారా.. అసలేం జరిగిందంటే..
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు (Chittoor) నుంచి కార్వేటి నగరం మండాలనికి ఓ వ్యాన్‌లో మద్యం (Liquor Transport Van) తరిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద వ్యాన్ టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ఉన్న మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అది చూసిన స్థానికులు, అటుగా వెళ్తున్నవారు దోచుకెళ్లిపోయారు.
కొందరు కాటన్ బాక్సులు ఎత్తుకుపోగా, మరికొందరు లుంగీలు, టవల్స్‌లో వేసుకొని తీసుకెళ్లారు. మహిళలు కూడా సీసాల కోసం ఎగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థానికి చేరుకున్నారు. అప్పటికే సగానిపైగా మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. పగిలినవిపోగా కొన్ని బాటిళ్లు మాత్రమే అక్కడ మిగిలాయి. సుమారు రూ.10 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం
లుంగీలు, టవళ్లలో మద్యం సీసాలను ఎత్తుకెళ్లిన ప్రజలు, మహిళలు
చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లి సమీపంలో ఘటన pic.twitter.com/pAiEr3HvTB
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2026
చనిపోయిన గొర్రెలనూ వదల్లే..
ఇలాంటి ఘటనే గత నెల 25న ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 200 గొర్రెలతో కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ట్రక్ బయలుదేరింది. మధ్యాహ్నం కౌశంబి జిల్లాలోని నేషనల్ హైవేపై అందావా టెది సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రక్ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోయాయి. అయితే గాయపడ్డ వారికి సాయం చేయాల్సిన స్థానికులు.. చనిపోయిన గొర్రెలను భుజాలపై వేసుకుని వెళ్లారు. బాధితులు సాయం కోసం అర్థిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. చిన్నా, పెద్ద, ఆగ, మగ అని తేడాలేకుండా అందినకాడికి గొర్రెలను తీసుకెళ్లారు.
कौशांबी में अनियंत्रित होकर पलटा बकरियों से भरा ट्रक। ट्रक पलटते ही स्थानीय लोगों में बकरियों को लूटने की मची होड़।कोखराज थाना क्षेत्र के टेढ़ी मोड़ के पास हुआ भीषण हादसा।बकरी लूटने की अफ़रातफ़री का वीडियो सोशल मीडिया पर वायरल।@Uppolice@kaushambipolice@IgPrayagraj pic.twitter.com/fVxs9RoAiW
— Johit Kumar (Journalist) (@JohitKumar30938) May 24, 2026
తాజావార్తలు
- ●Patriot Review | పేట్రియాట్ రివ్యూ - మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Latha Rajinikanth | ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
- ●Kavvampalli Satyanarayana | రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పడిన లిఫ్ట్.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ముప్పు
- ●Post Office NSC | రూ.11 లక్షలు పెట్టుబడి.. వడ్డీగా రూ.5 లక్షలు పొందవచ్చు..
- ●Reels | రీల్స్‌కు బాగా అలవాటు పడ్డ జెన్ జీ తరం.. మెటా వెల్లడి..
- ●Trump Towers Hyderabad | ఆకాశాన్ని తాకేలా 64 అంతస్థులు.. కోకాపేటలో 'ట్రంప్ టవర్స్' అల్ట్రా-లగ్జరీ ఇండ్లు

Patriot Review | పేట్రియాట్ రివ్యూ - మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Latha Rajinikanth | ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?

Kavvampalli Satyanarayana | రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పడిన లిఫ్ట్.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ముప్పు

Post Office NSC | రూ.11 లక్షలు పెట్టుబడి.. వడ్డీగా రూ.5 లక్షలు పొందవచ్చు..






