త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trump Towers Hyderabad | ఆకాశాన్ని తాకేలా 64 అంతస్థులు.. కోకాపేటలో ‘ట్రంప్ టవర్స్’ అల్ట్రా-లగ్జరీ ఇండ్లు

కోకాపేటలో రాబోతున్న ప్రతిష్టాత్మక 'ట్రంప్ టవర్స్'కు రెరా అనుమతి లభించింది. 64 అంతస్థులు, విలాసవంతమైన స్కైబ్రిడ్జ్ తో రానున్న ఈ ప్రాజెక్ట్ విశేషాలు ఏంటో తెలుసా?

J

Hyderabad | Published On Jun 6, 2026, 12.12 pm IST

Trump Towers Hyderabad | ఆకాశాన్ని తాకేలా 64 అంతస్థులు.. కోకాపేటలో ‘ట్రంప్ టవర్స్’ అల్ట్రా-లగ్జరీ ఇండ్లు
Advertisement
  • హైదరాబాద్ కోకాపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ట్రంప్ టవర్స్' (Trump Towers) కు రెరా (RERA) అప్రూవల్
  • సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో, 64 అంతస్థులతో (G+64) రెండు బ్రహ్మాండమైన టవర్లు
  • రెండు టవర్లను కలుపుతూ 26 నుంచి 30వ అంతస్తుల మధ్య నిర్మించే భారీ 'స్కై బ్రిడ్జ్' ఈ ప్రాజెక్ట్ కే హైలైట్‌
  • 3.5 BHK నుంచి 6 BHK డ్యూప్లెక్స్ వరకు అల్ట్రా-లగ్జరీ ఫ్లాట్స్ అందుబాటులో ఉండగా, మే 2031 నాటికి ఇది పూర్తయ్యే అవకాశం

Trump Towers Hyderabad | త్రినేత్ర.న్యూస్ : రియల్ ఎస్టేట్ (Real Estate) మార్కెట్‌లో ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్ 'ట్రంప్ టవర్స్' (Trump Towers) కు ఎట్టకేలకు తెలంగాణ రెరా (TG-RERA) అనుమతి లభించింది. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేట (Kokapet) నియోపోలిస్‌లో.. ఐరా రియాల్టీ (IRA Realty), ట్రైబెకా డెవలపర్స్ (Tribeca Developers) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ అప్రూవల్ (రెరా ఐడీ: P02400010871) రావడంతో నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.

గ్లోబల్ లివింగ్ స్టాండర్డ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫీచర్స్ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.

ప్రైవసీకే పెద్దపీట.. విలాసవంతమైన నివాసాలు

ఈ ప్రాజెక్టును గోల్డెన్ మైల్ రోడ్‌లో సుమారు 4 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తున్నారు. ఇందులో రెండు ఐకానిక్ టవర్లను నిర్మిస్తుండగా, ఒక్కో టవర్ 64 అంతస్థుల (G+64) ఎత్తులో ఉంటుంది.

లో-డెన్సిటీ లివింగ్: ప్రతి ఫ్లోర్‌లో కేవలం 4 అపార్ట్‌మెంట్లు మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. దీనివల్ల నివాసితులకు అద్భుతమైన ప్రైవసీ దొరుకుతుంది.

Trump Towers Kokapet Gets RERA Approval Inside Hyderabad's Ultra-Luxury Project

ఫ్లాట్ల సైజులు: 3.5, 4, 4.5 BHK తో పాటు భారీ 6 BHK డ్యూప్లెక్స్ (Duplex) ఇండ్లను కూడా అందిస్తున్నారు. వీటి విస్తీర్ణం 3,600 చదరపు అడుగుల నుంచి గరిష్టంగా 12,000 చ.అడుగుల వరకు ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ మాస్టర్ పీస్.. భారీ 'స్కై బ్రిడ్జ్'

ట్రంప్ టవర్స్ డిజైన్‌లో అత్యంత అద్భుతమైన ఆకర్షణ.. రెండు టవర్లను అనుసంధానిస్తూ నిర్మించే భారీ స్కై బ్రిడ్జ్ (Sky Bridge). 26 నుంచి 30వ అంతస్తుల మధ్య భూమికి దాదాపు 220 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. ఇందులో క్లబ్‌హౌస్ స్పేస్, పార్టీ ఏరియాలు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, అబ్జర్వేటరీ, స్కై లాంజ్ ఉంటాయి. పక్కనే ఉన్న మరో లగ్జరీ ప్రాజెక్ట్ 'ది ట్రైలైట్' (The Trilight) లోని బ్రిడ్జ్ కంటే ఇది మరింత పెద్దదిగా ఉంటుందని సమాచారం.

3 లక్షల చ.అడుగుల్లో ఇంటర్నేషనల్ అమ్యూనిటీస్

లగ్జరీ లైఫ్‌స్టైల్ కోరుకునే వారి కోసం ఈ ప్రాజెక్ట్‌లో ఏకంగా 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సదుపాయాలు (Amenities) కల్పిస్తున్నారు. ఇన్ఫినిటీ-ఎడ్జ్ పూల్, లగ్జరీ స్పా, స్పోర్ట్స్ కోర్ట్స్, 24/7 కన్సీర్జ్ (Concierge) సర్వీస్ వంటివి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్ (ORR) కు అత్యంత చేరువలో ఉండటం వల్ల కోకాపేట ఇప్పుడు ఎలైట్ (Elite) కమ్యూనిటీకి గమ్యస్థానంగా మారింది. రెరా అప్రూవల్ రావడంతో, మే 2031 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించాలని (Possession) సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ధరలు, అధికారిక లాంచ్ తేదీ వంటి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Advertisement
Advertisement