PM Modi | పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి : ప్రధాని మోదీ
PM Modi | మధ్య ప్రాచ్యంలో (Middle East tensions) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
PM Modi | మధ్య ప్రాచ్యంలో (Middle East tensions) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మధ్య ఘర్షణల విషయంలో భారత్ ఎల్లప్పుడూ శాంతి, దౌత్యానికే కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
"ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలపై భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. అన్ని వివాదాలను చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకే భారత్ మద్దతు ఇస్తుంది" అని ప్రధాని స్పష్టం చేశారు. అదేవిధంగా ఉద్రిక్తతల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో చిక్కుకుపోయిన తమ పౌరుల భద్రతకోసం ఆయా దేశాలతో కలిసి పనిచేస్తున్నామని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో భేటీ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
దుబాయ్‌లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థులు
ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో వేలాది విమానాలు రద్దయ్యాయి. ఫలితంగా అనేక మంది విదేశీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. విమానాల రద్దు కారణంగా పూణెకి చెందిన ఇందిరా యూనివర్సిటీకి చెందిన 84 మంది ఎంబీఏ విద్యార్థులు (Pune MBA students) దుబాయ్ (Dubai)లో చిక్కుకుపోయినట్లు వర్సిటీ తాజాగా తెలిపింది.
అకడమిక్ ప్రోగ్రామ్ కోసం విద్యార్థులు ఫిబ్రవరి 22, 23 తేదీల్లో దుబాయ్‌కి వెళ్లినట్లు వర్సిటీ పేర్కొంది. ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో వారు తిరిగి రావాల్సి ఉందని.. అయితే, ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారంతా దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నట్లు ఇందిరా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ శివేందు భూషణ్ తెలిపారు. విద్యార్థులతోపాటూ వర్సిటీకి చెందిన నలుగురు ఉపాధ్యాయులు కూడా వారితో ఉన్నారని.. వారంతా సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు వివరించారు. వారందరినీ సేఫ్‌గా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
దుబాయ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ మంత్రి తుమ్మల
తెలంగాణకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తన కుటుంబసభ్యుల చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ఆయన.. విమానాల రద్దుతో అక్కడే చిక్కుకుపోయారు.
తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్
మధ్యప్రాచ్యంలో (Middle East) నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ (Telangana) పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ (Control Room) ఏర్పాటు చేసింది. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో ఉంచుకుని కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అవసరమైన సమన్వయం, సహాయం అందించేలా పనిచేస్తుందన్నారు.
Also Read..
Middle East tensions | ఇరాన్ అనుకూల ర్యాలీలు.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
కువైట్‌లో అమెరికా ఎంబసీపై దాడి.. కూలిన యూఎస్ ఫైటర్ జెట్..!
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






