US embassy | కువైట్‌లో అమెరికా ఎంబసీపై దాడి.. కూలిన యూఎస్ ఫైటర్ జెట్..!
US embassy | ఇరాన్ (Iran) దాడులతో కువైట్ (Kuwait) దద్దరిల్లుతోంది. కువైట్‌లోని యూఎస్ ఎంబసీపై (US Embassy) ఇరాన్ డ్రోన్‌తో అటాక్ చేసింది. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలముకుంది.
International | Published On Mar 2, 2026, 12.28 pm IST
US embassy | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ఇరాన్ ప్రతీకారానికి పూనుకుంది. ఇందులో భాగంగానే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతోంది. తాజాగా ఇరాన్ (Iran) దాడులతో కువైట్ (Kuwait) దద్దరిల్లుతోంది. కువైట్‌లోని యూఎస్ ఎంబసీపై (US Embassy) ఇరాన్ డ్రోన్‌తో అటాక్ చేసింది. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలముకుంది. అంతేకాదు, దాడి అనంతరం అక్కడికి అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు..
అంతకు ముందు తమ పౌరులకు అమెరికా కీలక హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉన్నందున అక్కడ నివసించే అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ రాయబార కార్యాలయానికి రావొద్దని హెచ్చరించింది.
కూలిన అమెరికా ఎఫ్-15 ఫైటర్ జెట్..
ఇరాన్ జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ (US F-15 jet) కూలిపోయింది. MIM-104 పేట్రియాట్ (Patriot) వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ దాడి నుంచి పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.
దుబాయ్, దోహా, బెహ్రెయిన్‌లోనూ పేలుళ్లు..
మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఇవాళ ఉదయం దుబాయ్, దోహా, బెహ్రెయిన్, సైప్రస్, అబుదాబి, మనామా, ఖతార్ సహా పలు గల్ఫ్ నగరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. దీంతో ఆయాన నగరాలు పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లుతున్నాయి.
Also Read..
ఇరాన్‌తో ఘర్షణలు మరికొన్ని వారాలు కొనసాగొచ్చు : ట్రంప్
హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 50 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన ఐడీఎఫ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






