త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Middle East tensions | ఇరాన్ అనుకూల ర్యాలీలు.. అన్ని రాష్ట్రాల‌ను అల‌ర్ట్ చేసిన కేంద్రం

Middle East tensions | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు (Middle East tensions) పెరుగుతున్న నేప‌థ్యంలో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కీల‌క అడ్వ‌జైరీ జారీ చేసింది (central government).

D

National | Published On Mar 2, 2026, 1.12 pm IST

Middle East tensions | ఇరాన్ అనుకూల ర్యాలీలు.. అన్ని రాష్ట్రాల‌ను అల‌ర్ట్ చేసిన కేంద్రం
Advertisement

Middle East tensions | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు (Middle East tensions) పెరుగుతున్న నేప‌థ్యంలో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కీల‌క అడ్వ‌జైరీ జారీ చేసింది (central government). ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇరాన్ అనుకూల ర్యాలీలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్రం అల‌ర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కీల‌క అడ్వైజ‌రీ జారీ చేసింది.

ఇరాన్ అనుకూల రాడికల్ శక్తులు మతపరమైన ప్రార్థనా స్థలాలు, బహిరంగ సభలను వేదికగా చేసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను హెచ్చ‌రించింది. ఈ ఆందోళ‌న‌లు పౌర జీవ‌నానికి ఆటంకం క‌లిగించ‌కుండా, మ‌త సామ‌రస్యానికి భంగం క‌లిగించ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపింది. క్షేత్ర‌స్థాయిలో నిఘా పెంచాల‌ని సూచించింది. అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌ను జ‌ర‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. , సున్నితమైన ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. ఈ మేర‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.

ఇరాన్‌ సుప్రీం లీడర్ అయ‌తొల్లా అలీ ఖమేనీ మృతి పట్ల భార‌త్‌లో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మైన విష‌యం తెలిసిందే. కశ్మీర్‌లోని శ్రీనగర్‌, బుద్గాం, బందిపొరా, అనంత్‌నాగ్‌, పుల్వామా, యూపీలోని లక్నో, అజ్మీర్‌, హైద‌రాబాద్‌, క‌ర్ణాట‌క‌, న్యూఢిల్లీ, బీహార్‌, జార్ఖండ్‌లోని ప‌లు ప్రాంతాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెలిపారు. ఈ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో 15 లక్షల షియా ముస్లింలు ఉన్న క‌శ్మీర్‌లో ఇవాళ లాక్‌డౌన్ విధించారు. స్కూల్స్‌ను మూసివేశారు. ఇంట‌ర్నెట్‌పై కూడా నిషేధం విధించారు. ఈ నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా అన్ని రాష్ట్రాల‌ను కేంద్రం అప్ర‌మ‌త్తం చేసింది.

Also Read..

కువైట్‌లో అమెరికా ఎంబ‌సీపై దాడి.. కూలిన యూఎస్ ఫైట‌ర్ జెట్‌..!

పాక్‌కు భారీ షాక్‌.. నూర్‌ఖాన్ బేస్‌పై ఆఫ్ఘాన్ డ్రోన్ దాడి

ఇరాన్‌తో ఘ‌ర్ష‌ణ‌లు మ‌రికొన్ని వారాలు కొన‌సాగొచ్చు : ట్రంప్‌

Advertisement
Advertisement