త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pak Nur Khan Base | పాక్‌కు భారీ షాక్‌.. నూర్‌ఖాన్ బేస్‌పై ఆఫ్ఘాన్ డ్రోన్ దాడి

Pak Nur Khan Base | పాకిస్థాన్‌-ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan–Pakistan) మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఒక్క‌సారిగా పెరిగాయి. తాజాగా రావ‌ల్పిండి (Rawalpindi)లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌ (Nur Khan Air Base)లో ఉన్న పాకిస్థాన్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్‌ (Pakistan's Command and Control Centre)ను ల‌క్ష్యంగా చేసుకుని తాలిబ‌న్ ద‌ళాలు (Taliban forces) డ్రోన్ దాడుల‌కు పాల్ప‌డ్డాయి (drone strikes).

D

International | Published On Mar 2, 2026, 12.01 pm IST

Pak Nur Khan Base | పాక్‌కు భారీ షాక్‌.. నూర్‌ఖాన్ బేస్‌పై ఆఫ్ఘాన్ డ్రోన్ దాడి
Advertisement

Pak Nur Khan Base | పాకిస్థాన్‌-ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan–Pakistan) మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఒక్క‌సారిగా పెరిగాయి. స‌రిహ‌ద్దుల్లో ఇరు దేశాల మ‌ధ్య భీకర దాడులు కొన‌సాగుతున్నాయి. తాజాగా రావ‌ల్పిండి (Rawalpindi)లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌ (Nur Khan Air Base)లో ఉన్న పాకిస్థాన్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్‌ (Pakistan's Command and Control Centre)ను ల‌క్ష్యంగా చేసుకుని తాలిబ‌న్ ద‌ళాలు (Taliban forces) డ్రోన్ దాడుల‌కు పాల్ప‌డ్డాయి (drone strikes).

పాక్ ద‌ళాల‌కు చెందిన కీల‌క బేస్‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేసిన‌ట్లు ఆఫ్ఘాన్‌ తాజాగా ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగానే రావ‌ల్పిండిలోని పాక్ ఆర్మీ ప్ర‌ధాన కార్యాల‌యానికి స‌మీపంలో ఉన్న నూర్‌ఖాన్ ఎయిర్‌ బేస్‌పై దాడులు చేసిన‌ట్లు తెలిపింది. డ్రోన్ల‌తో అటాక్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని ఆఫ్ఘాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. తాలిబ‌న్ ద‌ళాలు క్వెట్టాలోని 12వ డివిజ‌న్ ప్ర‌ధాన కార్యాల‌యంపై, ఖైబ‌ర్ ప‌ఖ్తుఖ్వాలోని ఇత‌ర పాక్ సైనిక స్థావ‌రాల‌పై డ్రోన్ దాడులు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించింది. అయితే, ఈదాడిని పాక్ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కూ ధ్రువీక‌రించ‌లేదు.

కాగా, ఈ నూర్‌ఖాన్ ఎయిర్‌ బేస్ పాక్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో అత్యంత కీల‌క‌మైన‌ది. గ‌తంలో భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో భార‌త ద‌ళాలు ఈ నూర్‌ఖాన్ బేస్‌పై దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఆ దాడుల్లో ఇది తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. ప్ర‌స్తుతం దీన్ని పాక్ పున‌ర్నిర్మించుకుంటోంది. ఆ ప‌నులు ఇంకా కొన‌సాగుతుండ‌గానే.. ఇప్పుడు దానిపై తాలిబ‌న్ సైన్యం దాడి చేయ‌డంతో మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌కు ఆటంకం క‌లగ‌డ‌మే కాకుండా మ‌రింత న‌ష్టం చేకూరిన‌ట్లైంది.

Also Read..

Donald Trump | ఇరాన్‌తో ఘ‌ర్ష‌ణ‌లు మ‌రికొన్ని వారాలు కొన‌సాగొచ్చు : ట్రంప్‌

Israel | హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం.. 50 గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించిన ఐడీఎఫ్‌

భ‌గ్గుమ‌న్న హ‌ర్ముజ్ జ‌ల‌సంధి.. భార‌తీయుల‌తో వెళ్తున్న‌ చ‌మురు నౌక‌పై ఇరాన్ దాడి

Advertisement
Advertisement