B-52 Bomber Crashed | కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్ విమానం.. 8 మంది మృతి
B-52 Bomber Crashed | అమెరికా వైమానిక దళానికి (US Air Force) చెందిన బీ-52 వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలిపోయింది (B-52 Bomber Crashed). ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ (Edwards Air Force Base) నుంచి టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
International | Published On Jun 16, 2026, 10.47 am IST
B-52 Bomber Crashed | అమెరికాలోని కాలిఫోర్నియా (California)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు (US Air Force) చెందిన బీ-52 వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలిపోయింది (B-52 Bomber Crashed). ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ (Edwards Air Force Base)నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే అది కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
కాలిఫోర్నియాలోని మోహావే ఎడారిలోని కీలక ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఈ బాంబర్ విమానం మధ్యాహ్నం సమయంలో టేకాఫ్ అయింది. రొటీన్ టెస్ట్ మిషన్‌లో భాగంగా బీ-52 బాంబర్ గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత క్షణాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు ఎయిర్ బేస్ అధికారికంగా ప్రకటించింది. వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు.
ప్రమాద సమాచారం అందుకున్న అత్యవసర సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌ఫీల్డ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. అక్కడికి చేరుకోవాల్సిన ఇతర విమానాల్ని ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లు తెలిపారు. ఇక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన లాంగ్ రేంజ్, సబ్‌సోనిక్ యుద్ధ విమానం. బీ-52 యుద్ధ విమనాలను బోయింగ్ సంస్థ తయారుచేసింది. ప్రచ్ఛన్న యుద్ధ (Cold War) సమయంలో సోవియట్ యూనియన్‌తో సంభవించే ఘర్షణలను ఎదుర్కొనేందుకు దీనిని మొదట రూపొందించారు. 1950లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇది చాలా పాత విమానం. అయితే, దీన్ని అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించడంతో దశాబ్దాలుగా యూఎస్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళానికి వెన్నెముకా నిలుస్తూ వస్తోంది.
ఈ విమానం 185 అడుగుల వెడల్పు (వింగ్స్), 159 అడుగుల పొడవు ఉంటుంది. ఈ విమానాలు 70 వేల పౌండ్ల యుద్ధ సామాగ్రిని రవాణా చేయగలవు. అణు ఆయుధాలతో పాటు అత్యాధునిక క్షిపణులు, బాంబులను మోసుకెళ్లగలవు. బీ-52 బాంబర్లు దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు. శత్రుదేశాల రక్షణ వలయాలను ఛేదించి, సుదూర ప్రాంతాలపై దాడి చేయడం వీటి ప్రత్యేకత. అమెరికా ఈ విమానాన్ని వియత్నాం, గల్ఫ్, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌తో సైనిక చర్యలు సహా పలు యుద్ధాల్లో వాడుకుంది.
8 crew members KILLED in B-52 crash
A U.S. Air Force B-52 strategic bomber crashed shortly after takeoff from Edwards Air Force Base in California of the United States of America. 8 people lost their lives in this unfortunate accident.
pic.twitter.com/OSUYOdHu6J— Baba Banaras™ (@RealBababanaras) June 16, 2026
Also Read..
సంబంధిత వార్తలు

America | జీతం పెంచలేదని గోడౌన్‌కు నిప్పు పెట్టాడు.. యజమానికి 600 మిలియన్ డాలర్లు నష్టం..
ఏప్రిల్ 11, 2026

Viral Video | ఒక్క నిమిషంలో 16 కోట్ల విలువైన జ్యుయెలరీ ఎత్తుకెళ్లారు.. వీడియో చూస్తే మతిపోతుంది!
మార్చి 14, 2026

US Air Force Refueling Planes | సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. దెబ్బతిన్న 5 అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు
మార్చి 14, 2026
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్



