త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijayasai Reddy | 8న మ‌రో ఐదు ప్ర‌తిపాద‌న‌లు.. కొత్త పార్టీపై విజ‌య‌సాయి రెడ్డి కీల‌క అప్డేట్

Vijayasai Reddy | మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి త‌న కొత్త పార్టీపై మ‌రో కీల‌క అప్డేట్ ఇచ్చారు. కొత్త‌గా మ‌రో 5 ప్ర‌తిపాద‌న‌ల‌ను ఈ నెల 8న తిరుప‌తి ప్ర‌జ‌ల ముందు ఉంచ‌బోతున్నాన‌ని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

S

National | Published On Oct 6, 2026, 10.50 am IST

Vijayasai Reddy | 8న మ‌రో ఐదు ప్ర‌తిపాద‌న‌లు.. కొత్త పార్టీపై విజ‌య‌సాయి రెడ్డి కీల‌క అప్డేట్
Advertisement

Vijayasai Reddy | త్రినేత్ర న్యూస్ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి త‌న కొత్త పార్టీపై మ‌రో కీల‌క అప్డేట్ ఇచ్చారు. కొత్త‌గా మ‌రో 5 ప్ర‌తిపాద‌న‌ల‌ను ఈ నెల 8న తిరుప‌తి ప్ర‌జ‌ల ముందు ఉంచ‌బోతున్నాన‌ని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

నూతన రాజకీయ పార్టీని ప్రకటించే ముందు, ప్రజల ఎజెండాగా ఇప్పటివరకు 15 అంశాలను ప్రకటించాను. ఈ నెల 8న గురువారం కలియుగ దైవమైన తిరుమలేశ్వరుని పాదాల వద్ద, తిరుపతిలో నా 4వ ప్రెస్‌మీట్‌ పెడుతున్నాన‌ని విజ‌య సాయి రెడ్డి పేర్కొన్నారు.

రాయలసీమలో కరువు, ఎల్‌నినో ప్రభావం, వలసలు, దేవుడంటే భక్తి లేని ఆ రెండు కుటుంబాలు, మన సంస్కృతి మీద, భారతీయత మీద చేయిస్తున్న దాడి గురించి కూడా మాట్లాడతా. మన రాష్ట్రంలోనే మనం మైనార్టీలుగా మారిపోయే పరిస్థితిని నివారించటానికి మరో 5 ప్రతిపాదనల్ని తిరుపతిలో ప్రజల ముందు ఉంచబోతున్నా. సమాజం కోసం ఆలోచన చేసే మీడియా మిత్రులంతా ఈ సమావేశానికి హాజరై, నా ప్రతిపాదనల్ని ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నాన‌ని విజ‌యి సాయి రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement