Tollywood | విడుదల రోజే పైరసీ బారిన పడిన దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా – కేసు నమోదు
విడుదల రోజు దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ఆకాశంలో ఒక తార పైరసీ బారిన పడింది. ఈ పైరసీపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూల్‌లోని సిటీ స్క్వేర్ మాల్ థియేటర్‌లో అక్రమంగా కెమెరాలో సినిమాను షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Entertainment | Published On Nov 21, 2026, 2.22 pm IST
Tollywood | దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తెలుగు మూవీ ఆకాశంలో ఒక తారకు పెద్ద షాక్ తగిలింది. రిలీజైన కొద్ది గంట్లలోనే ఈ సినిమా పైరసీ బారిన పడింది. ఈ పైరసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఆకాశంలో ఒక తార శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ సాదినేని దర్వకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంస్థలు నిర్మించాయి. ఆస్ట్రోనాట్ కావాలనే భార్య కలను ఓ భర్త ఎలా నెరవేర్చాడనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
పైరసీ...
ఆకాశంలో ఒక తార రిలీజై కొద్ది గంటలు కూడా గడవక ముందే ఈ సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఓ వైబ్‌సెట్‌లో సినిమా మొత్తాన్ని అప్‌లోడ్ చేశారు. ఈ పైరసీపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌తో కలిసి నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూల్‌లోని సిటీ స్క్వేర్ మాల్ థియేటర్‌లో రహస్యంగా ఈ సినిమాను కెమెరాలో షూట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆకాశంలో ఒక తారతో పాటు రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం సినిమాలను కూడా పైరసీ చేసినట్లు గుర్తించారు. థియేటర్‌లో రికార్డ్ చేసిన సినిమాలను go2.india4moviee.click అనె వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు కనిపెట్టారు. ఈ సైట్ నుంచి పైరసీ చేసిన కొత్త సినిమాలను తొలగించారు.
టాలీవుడ్ వర్గాల ఆందోళన....
ఆకాశంలో ఒక తార సినిమాను అక్రమంగా థియేటర్‌లో రికార్డ్ చేసిన వారి వివరాలతో పాటు పైరసీ వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు ఇన్వేస్టిగేషన్‌ను కొనసాగిస్తోన్నట్లు సమాచారం. విడుదల రోజేకొత్త సినిమాలు పైరసీ బారిన పడటంపై టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Akasamlo Oka Tara Review | ఆకాశంలో ఒక తార రివ్యూ – దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?
నవంబర్ 20, 2026

OTT | ఒకే రోజు ఓటీటీలో…థియేటర్లలో విశ్వేక్సేన్, తరుణ్‌భాస్కర్ సినిమాలు
నవంబర్ 19, 2026

Hero Nani | దుల్కర్ సల్మాన్ హీరో – నాని ప్రొడ్యూసర్ – కొత్త కాంబో ఫిక్స్
నవంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
- ●Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?
- ●TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు



