త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gig Workers | 14న గిగ్ వ‌ర్క‌ర్ల‌తో రాహుల్ గాంధీ ర్యాలీ.. HICC వద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు

Gig Workers | ఈ నెల 13, 14 తేదీల్లో హైద‌రాబాద్ హైటెక్స్‌లో భార‌త్ స‌మ్మిట్ (Bharath Summit)  జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజ‌రుకానున్నారు. ఈ సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 14న‌ గిగ్ వ‌ర్క‌ర్ల‌తో (Gig Workers) భారీ ర్యాలీ నిర్వ‌హించనున్నారు.

G

Telangana | Published On Nov 12, 2026, 11.35 am IST

Gig Workers | 14న గిగ్ వ‌ర్క‌ర్ల‌తో రాహుల్ గాంధీ ర్యాలీ.. HICC వద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు
Advertisement

Gig Workers | త్రినేత్ర న్యూస్‌: ఈ నెల 13, 14 తేదీల్లో హైద‌రాబాద్ హైటెక్స్‌లో భార‌త్ స‌మ్మిట్ (Bharath Summit)  జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజ‌రుకానున్నారు. ఈ సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 14న‌ గిగ్ వ‌ర్క‌ర్ల‌తో (Gig Workers) భారీ ర్యాలీ నిర్వ‌హించనున్నారు. శిల్ప‌క‌ళావేదిక నుంచి హైచ్‌ఐసీసీ (HICC) వ‌ర‌కు ఈ ర్యాలీ జ‌రుగ‌నుంది. అనంత‌రం హెచ్ఐసీసీ వ‌ద్ద‌ ఉన్న జ‌య‌భేరి, మీనాక్షి ట‌వ‌ర్స్ స‌మీపంలోని మైదానంలో స‌భ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం నిబంధనలు, కొత్త సంక్షేమ పథకాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాగా, ఈ కార్య‌క్రమానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌ (Ponnam Prabhakar) , వివేక్ వెంక‌ట‌స్వామి ప‌రిశీలించారు. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా గిగ్ వర్కర్ల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkata Swamy) తెలిపారు. ఈ సభలో కేవలం గిగ్ వర్కర్లు (స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, డెలివరీ అగ్రిగేటర్ కార్మికులు) మాత్రమే పాల్గొనాలని రాహుల్ గాంధీ సూచించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని సుమారు 6 లక్షల మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమంలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్ కార్మికులు పాల్గొంట‌ర‌న్నారు. ప్రభుత్వం తీసుకురానున్న ప్రత్యేక యాప్‌లో నమోదు చేసుకుని, స్కాన్ చేయడం ద్వారా రిజిస్టర్డ్ వర్కర్లు ఈ ర్యాలీకి హాజరయ్యే అవకాశం కల్పించామ‌న్నారు.

తెలంగాణ ప్రభుత్వం 2026లో తీసుకొచ్చిన 'తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం) చట్టం' అమలుకు సంబంధించిన కీలక నిబంధనలు (Rules & Regulations) మరియు సంక్షేమ బోర్డు నోటిఫికేషన్లను రాహుల్ గాంధీ ఈ వేదికపై అధికారికంగా ప్రారంభించనున్నారు.

Advertisement
Advertisement