Asaduddin Owaisi | మైనారిటీల సమస్యలపై ప్రతిపక్షాలు మౌనం ఎందుకు..? : ఒవైసీ
Asaduddin Owaisi | సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav)ను లక్ష్యంగా చేసుకొని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్పీ పేరును సమాజ్ వాదీ యాదవ్ పరివార్‌గా మార్చాలంటూ ఎద్దేవా చేశారు.
- ఎస్పీ పేరును ‘సమాజ్‌వాదీ యాదవ్ పరివార్’గా మార్చండి..
- అఖిలేష్‌పై ఒవైసీ విమర్శలు
Asaduddin Owaisi | త్రినేత్ర న్యూస్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు ఎక్కుపెట్టారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav)ను లక్ష్యంగా చేసుకొని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్పీ పేరును సమాజ్ వాదీ యాదవ్ పరివార్ (Samajwadi Yadav Parivar)గా మార్చాలంటూ ఎద్దేవా చేశారు.
అజంగఢ్, ఫిరోజాబాద్ వంటి నియోజకర్గాల్లో అఖిలేష్ యాదవ్ కుటుంబ సభ్యులే ఎన్నికవుతున్న తీరును ప్రస్తావించిన ఒవైసీ.. అక్కడ ముస్లిం నాయకుల ప్రాతినిధ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఒకప్పుడు అజంగఢ్, ఫిరోజాబాద్ నియోజకవర్గాల నుంచి ముస్లిం అభ్యర్థులు గెలిచేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అక్కడ అఖిలేష్ కుటుంబ సభ్యులే ఎన్నికవుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ పేరును సమాజ్ వాదీ యాదవ్ పరివార్‌గా మార్చండి అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.
అదేవిధంగా యూపీలో అఖిలేష్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులను రక్షించడంలో ఎస్పీ ప్రభుత్వం విఫలమైందని ఒవైసీ ఆరోపించారు. ఈ అల్లర్ల కారణంగా దాదాపు 50 వేల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఎంతో మంది పిల్లలు అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అల్లర్లు జరిగాయని గుర్తు చేశారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో మసీదులను కూల్చివేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. సమాజంలోని బలహీన వర్గాలు, మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్షాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Also Read..
అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసు కొట్టివేత
రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
సంబంధిత వార్తలు

Akhilesh Yadav Slams BJP | అక్రమాలకు పాల్పడితే జైలుకే: విద్యాశాఖ అధికారులకు అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్
అక్టోబర్ 21, 2026

Lucknow Ravana Hoardings | దసరా వేళ లక్నోలో పోస్టర్లు: రావణుడి 10 తలలుగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఎలాన్ మస్క్!
అక్టోబర్ 18, 2026

Asaduddin Owaisi | SIRపై సుప్రీంకోర్టుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ..
అక్టోబర్ 14, 2026
తాజావార్తలు
- ●Kangana Ranut | కలిసిరాని బాలీవుడ్ - హారర్ మూవీతో టాలీవుడ్లోకి కంగనా రనౌత్ రీఎంట్రీ
- ●DK Aruna | డిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలి.. డీకే అరుణ డిమాండ్
- ●Ramachander Rao | కాంగ్రెస్ పాలన పట్ల తెలంగాణ యువత అసంతృప్తి : ఎన్ రామచందర్ రావు
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం మరింత సులభం..
- ●Harish Rao | ఆందోళనలో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు..!
- ●Rahul Gandhi | అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసు కొట్టివేత

Kangana Ranut | కలిసిరాని బాలీవుడ్ - హారర్ మూవీతో టాలీవుడ్లోకి కంగనా రనౌత్ రీఎంట్రీ

DK Aruna | డిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలి.. డీకే అరుణ డిమాండ్

Ramachander Rao | కాంగ్రెస్ పాలన పట్ల తెలంగాణ యువత అసంతృప్తి : ఎన్ రామచందర్ రావు

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం మరింత సులభం..



