త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asaduddin Owaisi | SIRపై సుప్రీంకోర్టుకు ఎంఐఎం అధినేత‌ అస‌దుద్దీన్ ఒవైసీ..

Asaduddin Owaisi | ఓటర్ల జాబితా ప్ర‌త్యేక‌ సవరణ (SIR) ప్రక్రియపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో (Supreme Court) మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్‌ను నిర్వహిస్తున్న తీరును సవాలు చేస్తూ ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

G

Telangana | Published On Oct 14, 2026, 12.32 pm IST

Asaduddin Owaisi | SIRపై సుప్రీంకోర్టుకు ఎంఐఎం అధినేత‌ అస‌దుద్దీన్ ఒవైసీ..
Advertisement

Asaduddin Owaisi | త్రినేత్ర న్యూస్‌: ఓటర్ల జాబితా ప్ర‌త్యేక‌ సవరణ (SIR) ప్రక్రియపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో (Supreme Court) మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్‌ను నిర్వహిస్తున్న తీరును సవాలు చేస్తూ ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఆయ‌న‌ తరఫున‌ న్యాయవాది నిజాముద్దీన్ పాషా ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant), జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు దాఖ‌లు చేశారు. ఈ అంశంపై ఇప్పటికే దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి విచారించాలని కోరారు. దీనికి సీజేఐ ధ‌ర్మాస‌నం (CJI Bench) సానుకూలంగా స్పందించింది. ఎస్ఐఆర్‌పై ఇప్ప‌టికే ఇండియా (INDIA) కూట‌మి త‌ర‌ఫున కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసింది. ఇవి గురువారం (అక్టోబర్ 15) కోర్టుముందు విచార‌ణ‌కు రానుంది.

ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, పెద్ద ఎత్తున ఓట్లను తొల‌గిస్తున్నారంటూ తొలగిస్తున్నారంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే సహా ‘ఇండియా’ కూటమికి చెందిన 10 మందికి పైగా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎస్ఐఆర్‌ అమలును, ఓటర్ల డేటాబేస్, ఓట్ల తొలగింపులను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీతో స్వతంత్ర ఆడిట్ చేయించాలని ప్రతిపక్షాలు తమ పిటిషన్లలో డిమాండ్ చేశాయి.

సుప్రీంకోర్టు ముందు ఉంచిన 10 కీలక డిమాండ్లు ఇవే..

SIR రికార్డులన్నీ కోర్టుకు సమర్పించాలి
2025 జూన్ 24న ఎస్ఐఆర్ ప్రారంభించేందుకు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్, మీటింగ్ మినట్స్, అభ్యంతరాల పత్రాలతో పాటు ECINET, ERONET యాక్సెస్ లాగ్ వివరాలన్నింటినీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలి.

రాజ్యాంగబద్ధతపై సమీక్ష
ఎస్ఐఆర్ విషయంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324కు, 2023 నాటి ఈసీ చట్టానికి, చారిత్రక టీఎన్ శేషన్ కేసు తీర్పునకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేల్చాలి. చట్టబద్ధత లేని నిర్ణయాలను రద్దు చేయాలి.

నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు
ఓటర్ల జాబితా తయారీలో నిబంధనలను ఉల్లంఘించిన బాధ్యులైన ఎన్నికల అధికారులపై పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 32 కింద కఠిన చర్యలు తీసుకోవాలి.

2023 చట్టం ప్రకారం పారదర్శకత
ఈ పిటిషన్‌పై ఈసీ తగిన నిర్ణయం తీసుకునేలా, భవిష్యత్తులో ఎస్ఐఆర్ విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రికార్డు చేసేలా ఆదేశించాలి.

ఆన్‌లైన్ ఫామ్-6లో నిబంధనల మార్పులు రద్దు
ఆన్‌లైన్ ఫామ్-6 అనేది 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్‌కు లోబడి ఉండాలని, ముందస్తు ప్రక్రియ లేకుండా అందులో ఏకపక్ష మార్పులు చేయకూడదు.

రిటైర్డ్ సుప్రీం జడ్జితో స్వతంత్ర కమిటీ ఆడిట్
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో టెక్నికల్ నిపుణులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లపై, ECINET/ERONET డేటాబేస్‌పై విచారణ జరపడంతో పాటు ఈవీఎంల (EVMs) సాంకేతిక రూపకల్పన, డిప్లాయ్‌మెంట్ విధానాలపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలి.

తొలగించిన ఓటర్ల వివరాలు బహిర్గతం చేయాలి
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎవరెవరి ఓట్లు తొలగించారో ఆ వివరాలను బూత్‌ల వారీగా, తొలగించడానికి గల కారణాలతో సహా అధికారికంగా వెల్లడించాలి. అర్హులైన ఓటర్లను తిరిగి చేర్చేందుకు స్పష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించకూడదు
సహేతుకమైన కారణం చూపకుండా, ముందస్తు నోటీసు ఇచ్చి వాదనలు వినకుండా ఏ ఒక్క ఓటరు పేరునూ జాబితా నుంచి తొలగించరాదు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ వంటి రాష్ట్రాల్లో చివరి తేదీ వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలి.

ఎస్ఐఆర్ ప్రక్రియపై తక్షణ మధ్యంతర స్టే
ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేంతవరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి.

న్యాయస్థానం విచక్షణాధికారాలు
రాజ్యాంగ విలువలు, పౌరుల ఓటు హక్కుల పరిరక్షణకు పరిస్థితులకు అనుగుణంగా కోర్టు భావించే ఇతర తగిన ఆదేశాలను జారీ చేయాలని విపక్షాలు పిటిషన్‌లో అభ్యర్థించాయి.

Advertisement
Advertisement