Tummala Nageswara Rao | పండ్ల మార్కెట్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి
Tummala Nageswara Rao | కోహెడ ఫ్రూట్ మార్కెట్ (Koheda Fruit Market) నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (Tummala Nageswara Rao) సూచించారు.
- వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలి
- 2028, జూన్ 2 నాటికి పూర్తి స్థాయి మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి
- పనుల్లో జాప్యం జరిగితే నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకునేలా నిబంధనలు సవరించాలి
- అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశం
Tummala Nageswara Rao | త్రినేత్ర న్యూస్: కోహెడ ఫ్రూట్ మార్కెట్ (Koheda Fruit Market) నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (Tummala Nageswara Rao) సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్షా (Review) సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల ప్రస్తుత పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన లేఔట్ వివరాలు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి దశ నిర్మాణ పనులను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని, మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేసి 2028, జూన్ 2 నాటికి పూర్తి స్థాయి పండ్ల మార్కెట్‌ను రైతులకు అంకితం చేసేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.
కొహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అవసరమైన మౌలిక సదుపాయాలతో కూడిన సమీకృత పండ్ల మార్కెట్‌ను నిర్మించి రాష్ట్ర రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. రైతులు పండించిన పండ్లను నాణ్యత కోల్పోకుండా నిల్వ చేసుకోవడానికి, విక్రయించడానికి, దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లకు తరలించడానికి అనువైన అన్ని సదుపాయాలు ఈ మార్కెట్‌లో అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి.
ప్రత్యేక అధికారిగా రాహుల్ రాజ్
నిర్మాణ సంస్థ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగితే సంబంధిత నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకునేలా ఒప్పంద నిబంధనల్లో అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా, నిర్ణయించిన కాలపరిమితిలో ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రత్యేక అధికారిగా రాహుల్ రాజ్‌ను నియమిస్తూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ అడ్వైజర్ అండ్ ప్రభుత్వ కార్యదర్శి, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●RS Praveen Kumar | వియత్నాం ‘గ్రీన్ ఎస్ఎం’ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందెవరు?
- ●EFLU | యూజీసీ నెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఇఫ్లూ
- ●Akhilesh Yadav | 2027 ఎన్నికల్లో బీజేపీకి శాశ్వత ఓటమి తప్పదు : అఖిలేష్ యాదవ్
- ●TGSRTC | మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం.. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం
- ●Gold And Silver Prices Today | లాభాల స్వీకరణ ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.21వేలు తగ్గిన పసిడి ధర..
- ●2027 UP Elections | ఒవైసీ కొత్త ఎత్తుగడ.. యూపీలో మూడో ఫ్రంట్..!

RS Praveen Kumar | వియత్నాం ‘గ్రీన్ ఎస్ఎం’ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందెవరు?

EFLU | యూజీసీ నెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఇఫ్లూ

Akhilesh Yadav | 2027 ఎన్నికల్లో బీజేపీకి శాశ్వత ఓటమి తప్పదు : అఖిలేష్ యాదవ్

TGSRTC | మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం.. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం





