త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | లాభాల స్వీక‌ర‌ణ ఎఫెక్ట్‌.. ఒక్క రోజులోనే రూ.21వేలు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌..

Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసే ప‌రిస్థితుల‌పై సందిగ్ధ‌త ఏర్ప‌డ‌డం, స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూప‌డం వంటి కార‌ణాల‌తో ఈక్విటీ మార్కెట్ల‌పై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. ఇదే ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా క‌నిపిస్తోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల చివ‌ర్లో గ‌రిష్ట స్థాయిల‌కు చేరిన బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌లేదు.

S

Business | Published On Nov 12, 2026, 12.25 pm IST

Gold And Silver Prices Today | లాభాల స్వీక‌ర‌ణ ఎఫెక్ట్‌.. ఒక్క రోజులోనే రూ.21వేలు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌..
Advertisement

Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసే ప‌రిస్థితుల‌పై సందిగ్ధ‌త ఏర్ప‌డ‌డం, స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూప‌డం వంటి కార‌ణాల‌తో ఈక్విటీ మార్కెట్ల‌పై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. ఇదే ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా క‌నిపిస్తోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల చివ‌ర్లో గ‌రిష్ట స్థాయిల‌కు చేరిన బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌లేదు. పెట్టుబ‌డిదారులు త‌ర‌చూ లాభాల స్వీక‌ర‌ణ‌కు ఆస‌క్తి చూపిస్తుండ‌డంతో ధ‌ర‌ల్లో తీవ్ర అస్థిర‌త నెలకొంది. ఈ క్ర‌మంలోనే గురువారం సైతం ధ‌ర‌లు ఒడిదుడుల‌కు గుర‌వుతున్నాయి. ఇక అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.26 శాతం స్వ‌ల్పంగా త‌గ్గి 3,977 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.27 శాతం త‌గ్గి 51 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 886 పాయింట్లు త‌గ్గి 1,38,857కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 935 పాయింట్లు త‌గ్గి 1,82,901కు చేరింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర ఒక్క రోజులోనే రూ.21వేల‌కు పైగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,980 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,11,840 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,39,800 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,98,000 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.21,800 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,815 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,02,520గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,28,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,81,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.20,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,485 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.83,880గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,04,850 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,48,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.16,400 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,00,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,000గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,00,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,000 గా ఉంది.

Advertisement
Advertisement