త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | మాట నిల‌బెట్టుకున్న ప్ర‌భుత్వం.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవ‌ర్ కుమారుడికి ఉద్యోగం

TGSRTC | ఆర్టీసీ స‌మ్మె సంద‌ర్భంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న న‌ర్సంపేట డిపో డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ (Driver Shankar Goud) కుటుంబానికి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంది. ఇచ్చిన మాట ప్ర‌కారం ఆయ‌న‌ కుమారుడు హేమంత్ గౌడ్‌కి ఆర్టీసీలో (TGSRTC) రికార్డ్ ట్రెజ‌ర్‌గా ఉద్యోగం ఇచ్చింది.

G

Telangana | Published On Nov 12, 2026, 12.47 pm IST

TGSRTC | మాట నిల‌బెట్టుకున్న ప్ర‌భుత్వం.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవ‌ర్ కుమారుడికి ఉద్యోగం
Advertisement

TGSRTC | త్రినేత్ర న్యూస్‌: ఆర్టీసీ స‌మ్మె సంద‌ర్భంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న న‌ర్సంపేట డిపో డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ (Driver Shankar Goud) కుటుంబానికి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంది. ఇచ్చిన మాట ప్ర‌కారం ఆయ‌న‌ కుమారుడు హేమంత్ గౌడ్‌కి ఆర్టీసీలో (TGSRTC) రికార్డ్ ట్రెజ‌ర్‌గా ఉద్యోగం ఇచ్చింది. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆయ‌న‌కు నియామ‌క ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింద‌న్నారు. సీఎం రేవంత్‌ సూచనల మేరకు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున పరిహారం అందజేశామ‌ని చెప్పారు. యావత్ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఒక రోజు వేతనం దాదాపు రూ.కోటి అందించి కుటుంబానికి అండగా నిలిచార‌ని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్‌కు ఆర్టీసీలో రికార్డ్ ట్రెజర్ ఉద్యోగ నియామక పత్రం అందజేశామ‌ని తెలిపారు.

ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం ఆర్టీసీ బాధ్యత అని, ఉద్యోగులను కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాల‌ని, భౌతిక‌ దాడులకు పాల్పడవద్దని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. ప్రయాణికులు మర్చిపోయిన లక్షల రూపాయల విలువైన వస్తువులను నిజాయితీగా తిరిగి అప్పగిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఎందరో ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఆర్టీసీలో ఎక్కడైనా పొరపాటు జరిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల‌ని, సిబ్బందిపై దాడులకు పాల్పడవద్ద‌ని తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, బస్టాండ్ల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఏ గ్రామానికైనా బస్సు సౌకర్యం అవసరమైతే స్థానిక అధికారులను సంప్రదించాల‌ని సూచించారు. రూట్ వెరిఫికేషన్, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామ‌ని చెప్పారు.

Advertisement
Advertisement