iPhone 17 | భారీ తగ్గింపు ధరకు లభిస్తున్న ఐఫోన్ 17.. ఎందులో అంటే..?
iPhone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఐఫోన్ 17 కు వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. భారత్‌లోనూ విడుదలైన ఈ ఫోన్‌ను అధిక సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేశారు.
Technology | Published On Mar 11, 2026, 11.36 am IST
iPhone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఐఫోన్ 17 కు వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. భారత్‌లోనూ విడుదలైన ఈ ఫోన్‌ను అధిక సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేశారు. అత్యాధునిక సాంకేతికత, ప్రీమియం డిజైన్, అనేక ఫీచర్లతో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో యాపిల్‌కు భారీ అమ్మకాలను సాధించి పెట్టింది. ఇక ఈ ఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.82,900 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను తగ్గింపు ధరకే అందిస్తున్నారు. ఆ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.74,900గా ఉంది. ఇక దీనిపై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.
ఆఫర్ వివరాలు..
ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఐఫోన్ 17 బేస్ మోడల్‌ను రూ.74,900కు ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.82,900 ఉండగా ప్రస్తుతం రూ.8వేలు తగ్గించి ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఫోన్‌పై రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కలిపి ఉంటుంది. అలాగే పలు బ్యాంకు కార్డులను ఉపయోగిస్తే మరో రూ.2వేల వరకు ధర తగ్గుతుంది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.3వేల వరకు అదనపు డిస్కౌంట్ ఇస్తారు. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొంటే మరింత డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా ఈ ఫోన్‌ను ప్రస్తుతం తగ్గింపు ధరకు ఇస్తున్నారు.
ఐఫోన్ 17 ఫీచర్లు..
ఈ ఫోన్‌పై అదనంగా రూ.4వేల వరకు లేదా 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశం కూడా ఉంది. అందుకు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను వాడాల్సి ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో నానో సిమ్, ఇ-సిమ్ రెండింటినీ వేసుకోవచ్చు. ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్ డిఫాల్ట్‌గా వస్తుంది. 6.3 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లే ఉండగా, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇది అందిస్తుంది. దీని వల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే సూర్యకాంతిలోనూ స్పష్టంగా చూసేలా ఈ ఫోన్ డిస్‌ప్లే 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. డిస్‌ప్లేకు సెరామిక్ సీల్డ్ 2 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ఇది ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన రెండు కెమెరాలను ఇచ్చారు. ఒకటి ప్రైమరీ సెన్సార్ కాగా రెండోది అల్ట్రా వైడ్ సెన్సార్‌గా పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. యాపిల్ ఎ19 చిప్‌ను ఇచ్చారు. ముందు వైపు సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా ఉండగా, ఫోన్‌ను కేవలం కొన్ని నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



