Om Birla | ప్రధాని అయినా సరే ముందుగా నోటీసు ఇవ్వాల్సిందే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు : ఓం బిర్లా
Om Birla | సభలో తాను పక్షపాత ధోరణి చూపించానంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను లోక్‌సభ స్పీకర్ (Lok Sabha) ఓం బిర్లా (Om Birla) ఖండించారు. తాను తన విధులను నిష్పక్షపాతంగా, న్యాయంగా నిర్వహించేందుకే ప్రయత్నించానని స్పష్టం చేశారు.
Om Birla | సభలో తాను పక్షపాత ధోరణి చూపించానంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను లోక్‌సభ స్పీకర్ (Lok Sabha) ఓం బిర్లా (Om Birla) ఖండించారు. తాను తన విధులను నిష్పక్షపాతంగా, న్యాయంగా నిర్వహించేందుకే ప్రయత్నించానని స్పష్టం చేశారు. మంత్రైనా, ఎంపీ అయినా సభలో ప్రతీ సభ్యుడికీ నిబంధనల ప్రకారం మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగానే అందరికీ అవకాశం కల్పించినట్లు చెప్పారు. సభలో అందరూ సమానమేనని స్పష్టం చేశారు.
ఓం బిర్లా (Om Birla)పై ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (no-confidence motion) వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ తన స్థానాన్ని అధిష్టించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభంకాగానే ఓం బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చుకున్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడారు. తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పందించారు.
ప్రతీ ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంది..
సభలో ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఎంపీలు చేసిన ఆరోపణలను ఓం బిర్లా తిరస్కరించారు. "ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కొందరు సభ్యులు అన్నారు. సభలో మంత్రి అయినా ప్రతిపక్ష ఎంపీ అయినా.. నిబంధనల ప్రకారం మాట్లాడే హక్కు ప్రతి సభ్యునికీ ఉంటుంది. సభ సజావుగా సాగాలంటే నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. ఈ సభలో నిబంధనలు సభ్యులందరికీ సమానంగా వర్తిస్తాయి" అని స్పీకర్ స్పష్టం చేశారు.
అయితే, ఏదైనా అంశంపై మాట్లాడే ముందు తప్పకుండా నోటీసు ఇవ్వాలని స్పీకర్ స్పష్టం చేశారు. "సభలో ఎవరూ నిబంధనలకు అతీతులు కారు. ప్రధాన మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ఎంపీ అయినా సరే ఏదైనా అంశంపై మాట్లాడేముందు నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాతే మాట్లాడేందుకు వారికి అనుమతి ఇస్తాం. ఈ సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు" అని ఆయన స్పష్టం చేశారు.
Also Read..
Farooq Abdullah | ఆ దేవుడే నన్ను రక్షించాడు.. హత్యాయత్నం ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా
సంబంధిత వార్తలు

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
మే 8, 2026

Women Reservation | మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీకి లేఖ రాయనున్న ప్రతిపక్షాలు..!
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



