త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2027 | ఐపీఎల్‌లో 12 జట్లు.. ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు.. బీసీసీఐ కీలక ప్రకటన

IPL 2027 | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో జట్ల సంఖ్య పెరగనుందన్న ప్రచారానికి బీసీసీఐ తెరదించింది. ప్రస్తుతం ఉన్న 10 జట్లను 12కు పెంచే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

P

Sports | Published On Nov 11, 2026, 10.30 pm IST

IPL 2027 | ఐపీఎల్‌లో 12 జట్లు.. ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు.. బీసీసీఐ కీలక ప్రకటన
Advertisement
  • 2028 నుంచి జట్ల సంఖ్య పెంపుపై వస్తున్న వార్తలకు చెక్‌..
  • 2027 సీజన్‌పైనే పూర్తి దృష్టి
  • బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవజిత్ సైకియా

IPL 2027 | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో జట్ల సంఖ్య పెరగనుందన్న ప్రచారానికి బీసీసీఐ తెరదించింది. ప్రస్తుతం ఉన్న 10 జట్లను 12కు పెంచే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. 2028 నుంచి ఐపీఎల్‌లో 12 జట్లు పాల్గొంటాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ అంశంపై బోర్డులో అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు.

2027 సీజన్‌పైనే దృష్టి..

ఐపీఎల్‌లో జట్ల సంఖ్య పెంపుపై వస్తున్న ప్రచారాన్ని సైకియా కొట్టిపారేశారు. ప్రస్తుతం బోర్డు దృష్టంతా 2027 సీజన్‌పైనే ఉందని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ 20వ సీజన్‌ కావడంతో దీనిని ప్రత్యేకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకుమించి భవిష్యత్తు ప్రణాళికలపై ప్రస్తుతం చర్చించడం లేదన్నారు. మీడియా కథనాల్లో ఎలాంటి ప్రామాణికత లేదని, అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. మరోవైపు ఐపీఎల్‌ 2027 సీజన్‌కు సంబంధించి మినీ వేలం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 16న గోవా వేదికగా ఒక్కరోజు పాటు వేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ అదనపు సమయం ఇచ్చింది. తొలుత నవంబర్‌ 15గా నిర్ణయించిన గడువును నవంబర్‌ 17 వరకు పొడిగించింది.

ఆటగాళ్ల జాబితాపై ఫ్రాంచైజీల కసరత్తు..

ఫ్రాంచైజీలు తమ రిటైన్‌ చేసుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను సమర్పించిన తర్వాత వేలానికి రిజిస్టర్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్‌ యాజమాన్యం అన్ని జట్లకు పంపనుంది. తమ అవసరాలకు అనుగుణంగా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్‌ చేసుకుంటాయి. వేలానికి సరిగ్గా వారం ముందు తుది జాబితాతోపాటు ఆటగాళ్ల పేర్ల క్రమాన్ని కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఐపీఎల్‌లో జట్ల సంఖ్య పెంపుపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి 10 జట్లతోనే లీగ్‌ కొనసాగనుండగా.. 2027 సీజన్‌ వేలంపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి.

Advertisement
Advertisement