Poonam Kaur | పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై పూనమ్ కౌర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు
Poonam Kaur | నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గత కొన్నేళ్లుగా నటుడు పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ఉద్దేశిస్తూ ఆమె పరోక్షంగా పలు పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.
Entertainment | Published On Nov 11, 2026, 9.59 pm IST
- గతంలో చేసిన పోస్టులకు నెటిజన్ స్పందన..
- ‘భవిష్యత్తులో మరిన్ని నిజాలు బయటకు వస్తాయంటూ ట్వీట్
Poonam Kaur | నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గత కొన్నేళ్లుగా నటుడు పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ఉద్దేశిస్తూ ఆమె పరోక్షంగా పలు పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాల నేపథ్యంలో పూనమ్ చేసిన ఓ వ్యాఖ్య నెట్టింట వైరల్ అవుతోంది. అయితే తన తాజా పోస్టులో ఆమె ఎక్కడా పవన్ పేరును నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.
గతంలోనూ పరోక్ష వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లపై పూనమ్ గతంలో పలుమార్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ తనకు, పవన్ కల్యాణ్‌కు మధ్య అడ్డుగోడగా నిలిచారని, ఆయన చుట్టూ ఓ వలయాన్ని సృష్టించి తనను దూరంగా ఉంచారని గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి మధ్య అసలు ఏం జరిగింది? ఈ వ్యవహారంలో త్రివిక్రమ్ పాత్ర ఏమిటి? అనే విషయాలపై పూనమ్ ఇప్పటివరకు పూర్తిస్థాయి వివరణ ఇవ్వలేదు. కొన్నిసార్లు పరోక్షంగా, మరికొన్నిసార్లు పేర్లు ప్రస్తావిస్తూ పోస్టులు చేసినప్పటికీ అసలు విషయం మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.
మరిన్ని నిజాలు బయటకు వస్తాయంటూ..
తాజాగా పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారనే వార్తల నేపథ్యంలో పూనమ్ పాత పోస్టుపై ఓ నెటిజన్ స్పందించారు. ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ అభిప్రాయపడ్డారు. దీనికి పూనమ్ స్పందిస్తూ.. ‘నిజం భవిష్యత్తులో మరింత వెలుగులోకి వస్తుంది. ప్రతి ఒక్కరికీ ప్రశాంతత, సమస్యలను అధిగమించే శక్తి కలగాలని కోరుకుంటున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ పోస్టులోనూ ఆమె పవన్ కల్యాణ్, ఆయన వ్యక్తిగత జీవితాన్ని నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో పూనమ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇన్నాళ్లుగా పరోక్ష వ్యాఖ్యలకే పరిమితమైన ఆమె.. భవిష్యత్తులో ఈ వ్యవహారానికి సంబంధించి ఏమైనా స్పష్టత ఇస్తారా? అన్న ఆసక్తి నెటిజన్లలో నెలకొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jensen Huang Alice Huang Controversy | 'హమ్ చిప్ దే చుకే సనమ్'.. ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్‌పై బాలీవుడ్ ఏఐ మీమ్స్ వర్షం
- ●Gold Price | బంగారం ధరలకు మళ్లీ బ్రేక్.. ఒక్కరోజే రూ.800 డౌన్.. వెండి రూ.5వేలు పతనం
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Rakul Preet Singh | స్టైల్ ఐకాన్‌గా రకుల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదిరే పోజులు!
- ●Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్!
- ●Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవరో తెలుసా?

Jensen Huang Alice Huang Controversy | 'హమ్ చిప్ దే చుకే సనమ్'.. ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్‌పై బాలీవుడ్ ఏఐ మీమ్స్ వర్షం

Gold Price | బంగారం ధరలకు మళ్లీ బ్రేక్.. ఒక్కరోజే రూ.800 డౌన్.. వెండి రూ.5వేలు పతనం

CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

Rakul Preet Singh | స్టైల్ ఐకాన్‌గా రకుల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదిరే పోజులు!



