Heavy Smog in Delhi | దేశ రాజధానిలో ఊపిరి ఆడని పరిస్థితి
ఎన్‌సీఆర్ పరిధి మొత్తంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. సివియర్ కేటగిరీకి దగ్గర్లో ఉంది. ఓ వైపు చలి తీవ్రత పెరగడం, మరోవైపు గాలి వేగం తగ్గడంతో కాలుష్యం అంతా ఎక్కడికక్కడ పేరుకుపోయి దట్టమైన పొగమంచులా ఏర్పడింది.
Heavy Smog in Delhi | దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో ఊపిరి ఆడని పరిస్థితి నెలకొన్నది. మరోసారి ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నది. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కప్పుకొన్నది. ఢిల్లీతో పాటు పక్కనే ఉన్న నోయిడా, ఘజియాబాద్ నగరాలు కూడా దట్టమైన పొగమంచులో చిక్కుకుపోయాయి. ఎయిర్ క్వాలిటీ సూచీ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. విషంతో నిండిన పొగమంచు వల్ల దేశ రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సివియర్ క్యాటగిరీకి చేరుకున్న ఏక్యూఐ
ఎన్‌సీఆర్ పరిధి మొత్తంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. సివియర్ కేటగిరీకి దగ్గర్లో ఉంది. ఓ వైపు చలి తీవ్రత పెరగడం, మరోవైపు గాలి వేగం తగ్గడంతో కాలుష్యం అంతా ఎక్కడికక్కడ పేరుకుపోయి దట్టమైన పొగమంచులా ఏర్పడింది. ఉదయం నుంచి రోడ్లు కూడా సరిగ్గా కనిపించడం లేదు.
ఎయిర్‌పోర్ట్‌కి అలర్ట్
దట్టమైన మంచు వల్ల ఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు కీలక సూచనలను అధికారులు జారీ చేశారు. విజిబిలిటీ సరిగ్గా లేనందున విమాన రాకపోకల్లో పలు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడానికి ముందే తమ విమానయాన సంస్థను కాంటాక్ట్ అయి తమ విమాన స్టేటస్‌ను తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
అత్యవసరం అయితేనే బయటికి రండి
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అత్యవసరం అయితేనే ప్రజలు బయటికి రావాలని, ఒకవేళ బయటికి వస్తే ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నావారు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా, రోజురోజుకూ ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుంది తప్పితే తగ్గడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు ఇంకా తీవ్రం అవుతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Rajdhani Express | షార్ట్ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



