త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India Pilot | మద్యం సేవించి విమానం నడపబోయిన పైలట్.. ప్రయాణికులు షాక్

పైలట్ అయినా, సిబ్బంది ఎవరైనా ఖచ్చితంగా ఎయిర్ లైన్స్ రూల్స్ పాటించాల్సిందే అని, రూల్స్ బ్రేక్ చేసిన వాళ్లు ఎవరైనా సరే.. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

J

International | Published On Jan 1, 2026, 2.41 pm IST

Air India Pilot | మద్యం సేవించి విమానం నడపబోయిన పైలట్.. ప్రయాణికులు షాక్
Advertisement

Air India Pilot | సాధారణంగా కారు, బస్సు, లారీ, బైక్ నడిపేవాళ్లు అంటే అప్పుడప్పుడు 90 వేసి నడుపుతుంటారు. ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తారు. పోలీసులకు దొరికితే ఇంకేం ఉంది బండి సీజ్ అవ్వాల్సిందే. అంతవరకు బాగానే ఉంది కానీ.. విమానం నడిపే పైలట్ ఎప్పుడైనా మందు తాగి విమానాన్ని నడిపితే ఆయన్ను మధ్యలో ఆపేందుకు ఎవరు ఉంటారు? మధ్యలో ఆపి వాళ్లను చెక్ చేసేవాళ్లు ఎవ్వరూ ఉండరు కదా. అలాగని మద్యం సేవించి వాళ్లు విమానం నడపరు. వాళ్లు కాక్‌పీట్‌లోకి చేరుకునే ముందే అన్ని టెస్టులు చేసి వాళ్లను కాక్‌పీట్‌లోకి పంపిస్తారు. అయినా కూడా ఓ పైలట్ మాత్రం మద్యం సేవించి విమానం నడిపేందుకు ప్రయత్నం చేశాడు.

కానీ.. అనుమానం వచ్చిన అధికారులు ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంతో అడ్డంగా బుక్ అయ్యాడు. ఆ పైలట్ ఎవరో కాదు.. మన ఎయిర్ ఇండియా విమానానికి చెందిన భారత్‌కి చెందిన పైలట్. కాకపోతే మనోడు మద్యం సేవించి విమానం తోలేందుకు ప్రయత్నించింది మాత్రం కెనడాలో. కెనడా నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కూడా గత సంవత్సరం 2025 డిసెంబర్ 23న చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకి చెందిన విమానం ఏఐ186, కెనడాలోని వాన్‌కోవర్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీకి వచ్చే విమానం అది. ఆ విమానం నడిపే పైలట్‌ను చూసిన అధికారులకు మద్యం సేవించిన వాసన వచ్చింది.

అంతకంటే ముందు ఆ పైలట్ ఎయిర్‌పోర్ట్‌లో మద్యం సేవించడం, లిక్కర్ కొనడం కూడా స్టాఫ్ చూశారట. ఆ విషయాన్ని అధికారులకు చెప్పడంతో ఆ పైలట్‌కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంతో అందులో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆ పైలట్‌ని అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు. పైలట్ వల్ల ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానం ఆలస్యం అయింది. వెంటనే ప్రత్యామ్నాయంగా వేరే పైలట్‌తో ఆ విమానాన్ని ఢిల్లీకి పంపించారు. దీనికి సంబంధించి కెనడా అధికారులకు, ప్యాసెంజర్లకు ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. పైలట్ అయినా, సిబ్బంది ఎవరైనా ఖచ్చితంగా ఎయిర్ లైన్స్ రూల్స్ పాటించాల్సిందే అని, రూల్స్ బ్రేక్ చేసిన వాళ్లు ఎవరైనా సరే.. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement