Tirumala Laddu | త్రినేత్ర.న్యూస్ : తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా 2025లో ఏకంగా 13.52 కోట్ల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోల్చితే లడ్డూ విక్రయాలు 10 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 2024లో 12.15 కోట్ల లడ్డూలు విక్రయించారు. అంటే ఈ ఏడాది 1.37 కోట్ల లడ్డూలను భక్తులకు అదనంగా విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇక గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా 2025 డిసెంబర్ 27న అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక డిసెంబర్ 28వ తేదీన 91,147 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం కూడా రికార్డే. నెయ్యిలో నాణ్యత మెరుగుపరచడం, పరిశుభ్రత వంటి కారణాల వల్లే లడ్డూ విక్రయాలు అధికంగా జరిగినట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.