త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat Sleeper Train | బడ్జెట్ ధరలో వందే భారత్ స్లీపర్ ట్రెయిన్… ఆ రూట్‌లో త్వరలో ప్రారంభం

ఈ రైలులో 16 కోచ్‌లుంటాయి. కంఫర్టబుల్ బెర్తులు,ఆటోమెటిక్ డోర్స్, ఆధునిక టాయిలెట్స్, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ ప్యాసెంజర్ డిస్‌ప్లేలు అందబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం ముగింపు కల్లా 12 వందే భారత్ స్లీపర్ ట్రెయిన్స్ రానున్నాయి.

J

National | Published On Jan 1, 2026, 4.24 pm IST

Vande Bharat Sleeper Train | బడ్జెట్ ధరలో వందే భారత్ స్లీపర్ ట్రెయిన్… ఆ రూట్‌లో త్వరలో ప్రారంభం
Advertisement

Vande Bharat Sleeper Train | మన దేశంలో వేగంగా దూసుకెళ్లే రైలు అనగానే వందేభారత్ గుర్తొస్తుంది. అత్యాధునిక సౌకర్యాలతో వందే భారత్ రైళ్లు కొన్నేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. అయితే.. అందులో కేవలం సీటింగ్‌కి మాత్రం అవకాశం ఉండేది. పడుకొని వెళ్లే సౌకర్యం ఉండేది కాదు. దీంతో వందే భారత్‌లో స్లీపర్ ట్రెయిన్స్‌ని కూడా తీసుకురావాలని రైల్వే ప్రయాణికుల నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను డిజైన్ చేయించింది. ఇప్పటికే టెస్టింగ్ కూడా పూర్తయింది. స్లీపర్ కోచ్‌లకి సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ స్లీపర్ కోచ్ రైళ్లను ముందుగా కోల్‌కతా- గౌహతి మార్గంలో ప్రారంభిచనున్నారు. ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణ అనుభవం కూడా గొప్పగా ఉండనుంది. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా ఈ రైళ్లను రైల్వే శాఖ తీర్చిదిద్దింది. అందులోనూ బడ్జెట్ ధరలోనే టికెట్ ధరలు ఉంటాయి.

15 నుంచి 20 రోజుల్లో తొలి రైలు ప్రారంభం

వచ్చే 15 నుంచి 20 రోజుల్లో తొలి వందే భారత్ స్లీపర్ ట్రెయిన్ కోల్‌కతా-గౌహతి రూట్‌లో ప్రారంభం కానుంది. అంటే జనవరి 18 లేదా 19 తేదీల్లో తొలి రైలును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈరైలుకి సంబంధించిన టెస్టింగ్, సర్టిఫికేషన్ పూర్తయిందని, లాంచ్ చేసే సరైన తేదీ ఇప్పుడే చెప్పలేమని, వచ్చే రెండుమూడు రోజుల్లో తేదీని ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభిస్తారని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

pm modi to launch first vande bharat sleeper train

థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ ధర రూ.2300

అసలే వందే భారత్, అందులోనూ స్లీపర్ క్లాస్ అంటే టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి కావచ్చు అని చాలామంది ప్రయాణికులు భావిస్తున్నా.. టికెట్ ధరలు సాధారణ రైళ్లలాగానే ఉండనున్నాయి. థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ ధర భోజనంతో కలిపి రూ.2300 గా ఉండనుంది. సెకండ్ క్లాస్ ఏసీ టికెట్ రూ.3000, ఫస్ట్ ఏసీ టికెట్ రూ.3600 వరకు ఉండనుంది.

విమానం టికెట్ కంటే తక్కువ ధరలో

విమానం టికెట్ ధరలకంటే కూడా తక్కువ ధరలనే వందేభారత్ స్లీపర్ ట్రెయిన్ టికెట్ ధరలను రైల్వే శాఖ నిర్ణయించింది. గౌహతి నుంచి కలకత్తాకు విమానంలో వెళ్లాలంటే రూ6 వేల నుంచి రూ.8 వేల వరకు టికెట్ ధర ఉంటుంది.కానీ.. వందే భారత్ థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ రూ.2300 కే దొరుకుతుంది. ఫస్ట్ క్లాస్ అయినా రూ.3600 మాత్రమే. మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఈ ధరలను నిర్ణయించామని కేంద్ర మంత్రి వైష్ణవ్ స్పష్టం చేశారు.

అస్సాం, బెంగాళీ సంప్రదాయ ఫుడ్ సర్వ్

కోల్‌కతా - గౌహతి రూట్‌లో ఈ ట్రెయిన్‌లో ప్రయాణించే ప్రయాణికులకు ఉచితంగా అస్సాం, బెంగాళీ సంప్రదాయ ఫుడ్ రుచి చూపించనున్నారు. గౌహతి నుంచి ప్రయాణించే వాళ్లకు అస్సాం ఫుడ్, కోల్‌కతా నుంచి ప్రయాణించే వాళ్లకు బెంగాళీ ఫుడ్ రుచి చూపించనున్నారు. ప్రయాణంతో పాటు స్థానిక సంప్రదాయాన్ని కూడా ప్రయాణికులు రుచి చూడాలనే ఉద్దేశంతో కొత్తగా ఈ రైలులో మాత్రమే ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

వెయ్యి కిమీల కంటే ఎక్కువ దూరం ఉన్న రూట్‌లోనే

ఈ రైళ్లను ఎక్కువగా వెయ్యి కంటే ఎక్కువ దూరం ఉన్న రూట్‌లోనే నడిపించాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ రైళ్లను తీర్చిదిద్దుతున్నారు. దూర ప్రయాణాలకు అనువుగా ఉండేలా, ప్రపంచస స్థాయి ప్రమాణాలో ఎక్కడా రాజీ పడకుండా అడ్వాన్స్ సేఫ్టీ సిస్టం, ఏరోడైనమిక్ డిజైన్ లాంటి ఫీచర్లు ఈ ట్రెయిన్ స్పెషాలిటీ.

ఈ రైలులో 16 కోచ్‌లుంటాయి. కంఫర్టబుల్ బెర్తులు,ఆటోమెటిక్ డోర్స్, ఆధునిక టాయిలెట్స్, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ ప్యాసెంజర్ డిస్‌ప్లేలు అందబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం ముగింపు కల్లా 12 వందే భారత్ స్లీపర్ ట్రెయిన్స్ రానున్నాయని, వచ్చే సంవత్సరం మరిన్ని రైళ్లను తీసుకొస్తామని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement