Viral Video | రద్దీ రోడ్డుపై నాలుగు కార్లతో యువకుల డేంజరస్ స్టంట్స్
ఢిల్లీ పొల్యూషన్ వల్ల చాలామంది లంగ్స్‌కి సమస్య వస్తుందని అనుకుంటే వీళ్లకు మాత్రం బెయిన్ పని చేయకుండా పోయినట్లుంది.. అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
Viral news | Published On Dec 28, 2025, 5.35 pm IST
Viral Video | యువతే దేశానికి బలం అని, యువశక్తే దేశ సంపద అని చెప్పుకోవడం కాదు.. అసలు మన దేశ యువత ఏం చేస్తున్నారో చూస్తే మన దేశం ఎటుపోతోంది అని అనక తప్పదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే ముక్కున వేలేసుకోవడం తప్పించి ఇంకేం చేయలేం. ఓవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువై ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు అదే ఢిల్లీలో కార్లు వేసుకొని రోడ్డు మీదికి వచ్చిన కొందరు యువకులు రోడ్డు మీద ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగేలా డేంజరస్ స్టంట్స్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు కార్లతో రోడ్డు మీద చాలా విన్యాసాలు చేశారు. ఒకరు సన్ రూఫ్ ఎక్కి, కొందరు కార్ల విండోస్ తీసి బయటికి వచ్చి రచ్చ చేయడం, అరవడం.. ఇలా వాళ్లు చేయని సాహసాలు లేవు. వీళ్ల పిచ్చి విన్యాసాలను వెనుక వస్తున్న ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఐటీవో నుంచి సారయ్ కాలే ఖాన్ రూట్‌లో రింగ్ రోడ్ మీద వీళ్ల విన్యాసాలు చూడండి. ఢిల్లీ పొల్యూషన్ వల్ల చాలామంది లంగ్స్‌కి సమస్య వస్తుందని అనుకుంటే వీళ్లకు మాత్రం బెయిన్ పని చేయకుండా పోయినట్లుంది.. అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వాహనాల వివరాలు సేకరించి భారీ ఫైన్ వేసేందుకు పోలీసులు కూడా సన్నద్ధం అవుతున్నారు.
📍Delhi: Reckless driving on Ring Road from ITO towards Sarai Kale Khan.
Seems like Delhi’s pollution is hitting brains harder than lungs.
Extremely dangerous driving, risking lives on a public road.
📹 10:44 PM | 26 Dec
Strict action needed.— Deadly Kalesh (@Deadlykalesh) December 27, 2025
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



