Jangaon | త్రినేత్ర.న్యూస్ : న్యూఇయర్ వేళ జర్మనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నికీలలకు తెలంగాణకు చెందిన ఓ యువకుడు సజీవదహనం అయ్యాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించేందుకు జర్మనీ వెళ్లాడు. అయితే హృతిక్ రెడ్డి నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాద ఘటన నుంచి తప్పించుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హృతిక్ రెడ్డిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధిత వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హృతిక్ రెడ్డి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.