త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JP Nadda | కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాకు అస్వ‌స్థ‌త‌.. ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లింపు

JP Nadda | కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా (JP Nadda) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ని వెంట‌నే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో (Delhi AIIMS) చేర్పించారు. అక్క‌డ వైద్యులు న‌డ్డాకు కరోనరీ యాంజియోగ్రఫీ (coronary angiography) ప‌రీక్ష‌లు చేశారు.

D

National | Published On Aug 14, 2026, 1.21 pm IST

JP Nadda | కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాకు అస్వ‌స్థ‌త‌.. ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లింపు
Advertisement

JP Nadda | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా (JP Nadda) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. నిన్న సాయంత్రం హ‌ఠాత్తుగా అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ని వెంట‌నే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో (Delhi AIIMS) చేర్పించారు. అక్క‌డ వైద్యులు కేంద్ర మంత్రికి అన్ని ప‌రీక్ష‌లు చేశారు. ఇందులో భాగంగానే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను గుర్తించేందుకు కరోనరీ యాంజియోగ్రఫీ (coronary angiography) కూడా చేశారు. ప్ర‌స్తుతం న‌డ్డా ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. కార్డియాలజీ విభాగం వైద్యుల పరిశీలనలో ఉంచిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు బులెటిన్ విడుదల చేసింది.

కాగా, న‌డ్డా గ‌త కొన్నిరోజులుగా తీరిక‌లేకుండా గ‌డుపుతున్నారు. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతూనే.. ఆయుష్మాన్ భారత్ వంటి కీల‌క ప్ర‌భుత్వ ప‌థ‌కాలపై స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా నీట్ ప‌రీక్ష‌ల అనంత‌రం దేశంలో తలెత్తిన రాజ‌కీయ ప‌రిణామాల‌పై వ‌రుస‌గా మీటింగ్‌లు నిర్వ‌హిస్తూ ఆయ‌న తీరిక లేకుండా ఉన్నారు. దీంతో విశ్రాంతి లేక‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న అసౌక‌ర్యానికి గుర‌య్యార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

Also Read..

విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వాళ్లెవ‌రు..? బీసీఐపై సీజేఐ ఆగ్ర‌హం

1,057 మందికి కేంద్ర ప‌త‌కాలు.. తెలంగాణ నుంచి 15 మంది ఎంపిక‌

పండ్లు, కూరగాయ‌ల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణ‌నే టాప్‌

Advertisement
Advertisement