త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NALSAR students | విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వాళ్లెవ‌రు..? బీసీఐపై సీజేఐ ఆగ్ర‌హం

NALSAR students | బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నల్సార్ లా యూనివర్సిటీ (NALSAR) విద్యార్థులకు వ్య‌తిరేకంగా జారీ చేసిన స‌ర్యూల‌ర్‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఈ విష‌యంతో బార్ కౌన్సిల్‌కు ఏంటి సంబంధం..? అని ప్ర‌శ్నించారు.

D

National | Published On Aug 14, 2026, 12.53 pm IST

NALSAR students | విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వాళ్లెవ‌రు..? బీసీఐపై సీజేఐ ఆగ్ర‌హం
Advertisement
  • నల్సార్ వ‌ర్సిటీ వివాదంపై సీజేఐ కీల‌క వ్యాఖ్య‌లు
  • నిర‌స‌న తెలిపే హ‌క్కు విద్యార్థుల‌కు ఉంది..
  • BCI అనవసరంగా జోక్యం చేసుకుంటోంది
  • బార్ కౌన్సిల్ తీరును త‌ప్పుబ‌ట్టిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

NALSAR students | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ లా యూనివర్సిటీ (NALSAR) విద్యార్థులకు వ్య‌తిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీసుకున్న నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల‌కు నిర‌స‌న తెలిపే హ‌క్కు ఉంద‌ని.. ఈ విష‌యంలో బీసీఐ జోక్యం అన‌వ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

నల్సార్ (NALSAR) లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి (Convocation) భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై పెద్ద వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. వంద‌లాది మంది విద్యార్థులు సీజేఐ రాకను వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాయడం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విద్యార్థుల వైఖ‌రిపై బార్ కౌన్సిల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. న్యాయవ్యవస్థను గౌరవించని వారు లాయర్లు కాలేరంటూ విద్యార్థులందరిపైనా బ్యాన్ విధించింది. విచారణ పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్‌కు చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చ‌ద‌వండి.. నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత

బీసీఐ నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. దీంతో వెన‌క్కి త‌గ్గిన బార్ కౌన్సిల్ విద్యార్థులందరి ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన వివాదాస్పద స‌ర్య్కుల‌ర్‌ను కొన్ని గంట‌ల్లోనే వెన‌క్కి తీసుకుంది. ఈ అంశం ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా సీజేఐ సూర్య‌కాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇది విద్యార్థులకు, త‌న‌కు (సీజేఐ) మ‌ధ్య జ‌ర‌గాల్సిన సంభాష‌ణ అని అన్నారు. ఈ విష‌యంతో బార్ కౌన్సిల్‌కు ఏంటి సంబంధం..? అని ప్ర‌శ్నించారు.

ఇది కూడా చ‌ద‌వండి.. సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

ఇందులో BCI అనవసరంగా జోక్యం చేసుకుంటోంద‌ని వ్యాఖ్యానించారు. విద్యార్థుల‌కు నిర‌స‌న తెలిపే పూర్తి హ‌క్కు ఉంద‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. తాను కూడా విద్యార్థిగా ఉన్న‌స‌మ‌యంలో నిర‌స‌న‌ల్లో చురుగ్గా పాల్గొన్నాన‌ని ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. నల్సార్ విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఈ పిటిష‌న్‌పై స్పంద‌న కోరుతూ బీసీఐకి నోటీసులు జారీ చేశారు. అనంత‌రం విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేశారు.

Also Read..

జోగిపేట ఏరియా ద‌వాఖాన‌లో న‌కిలీ డాక్ట‌ర్లు.. మరో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు

1,057 మందికి కేంద్ర ప‌త‌కాలు.. తెలంగాణ నుంచి 15 మంది ఎంపిక‌

పండ్లు, కూరగాయ‌ల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణ‌నే టాప్‌

Advertisement
Advertisement