త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viswanath And Sons | విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ రివ్యూ – సూర్య, మ‌మితా బైజు లేటెస్ట్‌ మూవీ ఎలా ఉందంటే?

క‌రుప్పు బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత సూర్య హీరోగా న‌టించిన విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ల‌క్కీ భాస్క‌ర్ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Aug 14, 2026, 12.54 pm IST

Viswanath And Sons |  విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ రివ్యూ – సూర్య, మ‌మితా బైజు లేటెస్ట్‌ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Viswanath And Sons | కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు సూర్యతెలుగు డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి కాంబినేష‌న్‌లో రూపొందిన మూవీ విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌. మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ర‌వీనా టాండ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఫ‌న్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ శుక్ర‌వారం తెలుగుతో పాటు త‌మిళంలో రిలీజైంది. విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ ఎలా ఉంది? ఈ సినిమాతో సూర్య‌కు మ‌రో హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

ఒలింపిక్ గోల్డ్ మెడ‌లిస్ట్‌...

సంజ‌య్ విశ్వ‌నాథ్ ( సూర్య‌) త‌ల్లి నిర్మ‌ల (రాధిక‌) అండ‌తో షూటింగ్ లో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధిస్తాడు. మ‌రోవైపు బిజినెస్‌మెన్‌గా స‌క్సెస్ అవుతాడు. ప్రేమ‌, పెళ్లి లాంటి బంధాల‌కు దూరంగా ఉంటుంటాడు. సంజ‌య్‌తోనే త‌మ వంశం ఆగిపోతుంద‌ని త‌ల్లి ప‌డుతోన్న బాధ చూడ‌లేక స‌రోగ‌సీ ద్వారా ఓ బిడ్డ‌కు తండ్రిగా మార‌తాడు సంజ‌య్‌. కానీ ఓ చిన్నారికి ప్రాణాంత‌క‌మైన వ్యాధి వ‌స్తుంది. ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటే చిన్నారి త‌ల్లి అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. డ‌బ్బు కోసం ట్రీట్‌మెంట్‌కు సాయం చేయ‌డానికి స‌రోగ‌సీ ద్వారా సంజ‌య్ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌ద‌న కామేశ్వ‌రి అలియాస్ మ్యాడీ (మ‌మితా బైజు) అంగీక‌రిస్తుంది. మ్యాడీ రాక‌తో సంజ‌య్‌జీవితం ఎలా మారిపోయింది? త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా బ‌త‌కాల‌ని అనుకునే మ్యాడీ సంజ‌య్‌తోఎలా ప్రేమ‌లో ప‌డింది? ఆమె ప్రేమ‌ను సంజ‌య్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? అమెరికా వెళ్లిపోవాల్సిన మ్యాడీ సంజ‌య్‌పై కోర్టు కేసు వేయ‌డానికి కార‌ణ‌మేమిటి? సంజ‌య్ తండ్రికి అంజ‌లి (ర‌వీనా టాండ‌న్‌)అనే మ‌హిళ‌తో ఉన్న సంబంధం ఏమిటి? మ్యాడీ ప్రేమ‌ను సంజ‌య్ ఒప్పుకున్నాడా? లేదా? అన్న‌దే మిగిలిన క‌థ‌.

వ‌యోభేదం....

హీరోకు న‌ల‌భై రెండేళ్లు...హీరోయిన్ వ‌య‌సు 25 ఏళ్ల కంటే త‌క్కువే... ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ .. వారి చిలిపి గొడ‌వ‌లు, అల్ల‌ర్ల‌తో ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమాను తెర‌కెక్కించారు. ఈ పాయింట్‌ను బోల్డ్‌గా, రొమాంటిక్ అంశాల‌తో చెప్ప‌చ్చు. కానీ ద‌ర్శ‌కుడు మాత్రం లైట్ హార్టెడ్ ఎమోష‌న్స్‌తో క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించారు.
ప్రేమ, పెళ్లి లాంటి బంధాల‌కు త‌న జీవితంలో చోటు లేద‌ని భావించే హీరో లైఫ్‌లోకి ఓ అమ్మాయి రావ‌డం. కొద్ది రోజుల్లో వెళ్లిపోతుంద‌ని అనుకున్న ఆమె అత‌డి లైఫ్‌లో శాశ్వాతంగా ఉండిపోవాల‌ని అనుకోవ‌డం...త‌ద్వారా నెల‌కొన్న సంఘ‌ర్ష‌ణ చుట్టూ ఈ క‌థ సాగుతుంది. ఓవ‌ర్ మెలో డ్రామా, సెంటిమెంట్స్ జోలికి పోకుండా ఫ‌న్నీగా ఈ క‌థ‌ను డీల్ చేశారు డైరెక్ట‌ర్‌. భిన్న మ‌న‌స్త‌త్వాలు కార‌ణంగా హీరోహీరోయిన్లు ఎప్పుడూ ఒక‌రితో మ‌రొక‌రు గొడ‌వ‌లు ప‌డే సీన్ల నుంచి కామెడీని రాబ‌ట్టుకున్నారు. టామ్ అండ్ జెర్సీ కాన్సెప్ట్‌తోనే చివ‌రి సినిమా సాగుతుంది.

ప్రెడిక్ట‌బుల్‌....

వ‌యోభేదం అనే పాయింట్ త‌ప్పితే విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ క‌థ‌లో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. హీరోయిన్ పాత్ర ప‌రిచ‌య‌మ‌య్యే సీన్‌తోనే సినిమా క్లైమాక్స్ ఏమిట‌న్న‌ది చెప్ప‌య‌చ్చు. అంత ప్రెడిక్ట‌బుల్‌గా స్క్రీన్‌ప్లేను రాసుకున్నారు డైరెక్ట‌ర్‌. ఫ‌స్ట్ హాఫ్ మొత్తం హీరోహీరోయిన్ల‌తో పాటు రాధిక పాత్ర‌ల చుట్టే ఇంకే ఇంట్లో క‌థ మొత్తం సాగుతుంది. సీరియ‌ల్‌లా సాగ‌దీశారు. హీరో పెళ్లి ఎందుకు వ‌ద్ద‌నుకున్నాడు? తండ్రిపై అత‌డికి ఉన్న కోపం ఏమిటి అన్న‌ది క‌న్వీన్సింగ్‌గా చెప్ప‌లేదు.

ఫ‌స్ట్ హాఫ్ క‌థే లేకుండా సాగుతుంది. పోనీ సెకండాఫ్‌లోనైనా డైరెక్ట‌ర్ ఏదో మ్యాజిక్ చేస్తాడ‌ని ఆశ‌గా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు క‌మ‌ర్షియ‌ల్ జోన్‌ల‌కు ఎంట‌రైపెద్ద షాకిచ్చాడు. ర‌వీనా టాండ‌న్ ఫ్యామిలీలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను హీరో సాల్వ్ చేసే సీన్లు ఇప్ప‌టికీ ఎన్నో సినిమాల్లో చూసిన‌వే. హీరో ఒక్క డైలాగ్ కొట్ట‌గానే అంద‌రూ క‌న్నీళ్ల‌తో క‌రిగిపోయి మారిపోవ‌డం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. హీరో ఫైట్ కోస‌మే కావాల‌నే అక్క‌డో విల‌న్‌ను పెట్టారు. ఆ సీన్లు మొత్తం ఫోర్స్‌డ్‌గా ఉంటాయి. నాయ‌కానాయిక‌లు ట్రాక్ మొత్తం సైడ్‌లైన్ అవుతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంది.

గ‌జినిలో....

విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌లో సూర్య చాలా స్టైలిష్‌గా క‌నిపించాడు. అత‌డి లుక్‌, గెట‌ప్ గ‌జిని సినిమాను గుర్తుకుతెస్తాయి. త‌ల్లి ప్రేమ‌ను గుర్తుచేసుకొని ఉద్వేగానికి లోన‌య్యే సీన్‌లో సూర్య న‌ట‌న బాగుంది. మ్యాడీ పాత్ర‌కు మ‌మితా బైజు సెట్ట‌వ్వ‌లేదు. అల్ల‌రి మ‌న‌స్త‌త్వం ఉన్న అమ్మాయిగా పాత్ర‌కు త‌గ్గ హుషారుత‌నం ఆమెలో క‌నిపించ‌లేదు. బ‌బ్లీగా ఉంది. హీరో త‌ల్లి పాత్ర‌లో రాధిక ఒదిగిపోయింది. ర‌వీనా టాండ‌న్ లాంటి సీనియ‌ర్ న‌టిని పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేని పాత్ర‌కు తీసుకున్నారు. త‌మిళ మూవీ కావ‌డంతో తెలుగు న‌టులు చాలా త‌క్కువ మందే ఉన్నారు. తెలుగు సినిమా అని బిల్డ‌ప్ ఇవ్వ‌డానికి హైప‌ర్ ఆది, ర‌ఘుబాబుల‌తో ఓ కామెడీ ట్రాక్ పెట్టారు. అది న‌వ్వించ‌లేదు. జీవి ప్ర‌కాష్ కుమార్ పాట‌లు, మ్యూజిక్ రెండు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నేనో బ‌ట‌ర్ ఫ్లై పాట ఒక్క‌టి ప‌ర్వాలేద‌నిపించింది. సూర్య పాడిన పెళ్లి సాంగ్‌కు అత‌డి వాయిస్ సెట్ట‌వ్వ‌లేదు. ఈ సినిమా మొత్తం నాలుగైదు లోకేష‌న్ల‌లోనే సాగుతుంది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి.

తెలుగులో కొత్త కాదు....

ఇలాంటి ఫ్యామిలీ క‌థ‌లు త‌మిళ ఆడియెన్స్‌కు కొత్త కానీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాదు. విశ్వ‌నాథ్ అండ్స్ స‌న్స్ సినిమా చూస్తుంటే గ‌తంలో వ‌చ్చిన ఎన్నో తెలుగు సూప‌ర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. పేరులో ఉన్న క్రియేటివిటీ సినిమాలో లేదు.

 

 

Advertisement
Advertisement