Fake Doctors | జోగిపేట ఏరియా దవాఖానలో నకిలీ డాక్టర్లు.. మరో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు
Fake Doctors | సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో (Jogipet Area Hospital) నకిలీ డాక్టర్ల (Fake Doctors) వ్యవహారం కలకలం సృష్టిస్తున్నది. హాస్పిటల్‌లో సీనియర్ వైద్యులు విధులకు హాజరు కాకుండా తమ స్థానంలో మరొకరిని డ్యూటీలకు పంపుతున్నారు.
Fake Doctors | త్రినేత్ర.న్యూస్: సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో (Jogipet Area Hospital) నకిలీ డాక్టర్ల (Fake Doctors) వ్యవహారం కలకలం సృష్టిస్తున్నది. హాస్పిటల్‌లో సీనియర్ వైద్యులు విధులకు హాజరు కాకుండా తమ స్థానంలో మరొకరిని డ్యూటీలకు పంపుతున్నారు. గత వారమే ఓ వైద్యునిపై సస్పెన్షన్ వేటు పడగా, తాజాగా మరో ఇద్దరు డాక్టర్లపై (Doctors Suspended) అధికారులు చర్యలు తీసుకున్నారు.
జోగిపేట ఏరియా దవాఖాన డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రమేశ్.. తనకు బదులు ప్రైవేటు డెంటల్ వైద్యుడు రవిని విధులకు పంపుతూ పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్ రమేశ్‌పై వైద్యశాఖ అధికారులు ఈ నెల 7న సస్పెన్షన్ వేటు వేశారు. ఇది జరిగి సరిగ్గా వారం రోజుల్లోనే మరో ఇద్దరు డాక్టర్లు పట్టుబడ్డారు. డాక్టర్ శివశంకర్ రెడ్డి, డాక్టర్ తులజా భవాని తమ స్థానంలో ప్రైవేటు వైద్యులను విధుల్లో ఉంచినట్లు విచారణలో గుర్తించారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీచేశారు. వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో మంత్రి దామోదర.. హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. జోగిపేట హాస్పిటల్‌లో వైద్యుల విధుల నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన జోగిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాఖాలోనే ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూస్తుండటం గమనార్హం.
సంబంధిత వార్తలు

Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు
ఆగస్టు 7, 2026

Journalists | జర్నలిస్టులకు నిమ్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ శిబిరం ప్రారంభం
జులై 24, 2026

Employees Health Scheme | ‘ఈహెచ్ఎస్’ పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్
జులై 17, 2026
తాజావార్తలు
- ●RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..
- ●Traffic Restrictions | మరికాసేపట్లో నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●JP Nadda | కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
- ●Ponnam Prabhakar | ఐదు జిల్లాలు.. 85 పుష్కర ఘాట్లు.. 88 కోట్లు.. ఇదే గోదావరి పుష్కరాల కార్యాచరణ
- ●SBI Har Ghar Lakhpati | ఎస్బీఐ లఖ్పతి స్కీం.. రూ.600తో రూ.1 లక్ష..
- ●Viswanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ - సూర్య, మమితా బైజు లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే?

RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..

Traffic Restrictions | మరికాసేపట్లో నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు

JP Nadda | కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

Ponnam Prabhakar | ఐదు జిల్లాలు.. 85 పుష్కర ఘాట్లు.. 88 కోట్లు.. ఇదే గోదావరి పుష్కరాల కార్యాచరణ



