త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Galaxy Z Fold 8 | గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ..

Galaxy Z Fold 8 | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ తాజాగా గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 8, జ‌డ్ ఫ్లిప్ 8, గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 సిరీస్ మోడ‌ల్స్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా గురువారం నుంచి ఆయా ఉత్ప‌త్తుల‌కు అమ్మ‌కాలు ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా రిటెయిల్ స్టోర్స్‌తోపాటు శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఈ డివైస్‌లు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి.

S

Technology | Published On Aug 14, 2026, 11.59 am IST

Galaxy Z Fold 8 | గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ..
Advertisement

Galaxy Z Fold 8 | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ తాజాగా గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 8, జ‌డ్ ఫ్లిప్ 8, గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 సిరీస్ మోడ‌ల్స్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా గురువారం నుంచి ఆయా ఉత్ప‌త్తుల‌కు అమ్మ‌కాలు ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా రిటెయిల్ స్టోర్స్‌తోపాటు శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఈ డివైస్‌లు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇటీవ‌ల ప్రీ ఆర్డ‌ర్ సంద‌ర్భంగా ఆయా ఉత్ప‌త్తుల‌కు వినియోగ‌దారుల నుంచి భారీ ఎత్తున స్పంద‌న ల‌భించింద‌ని శాంసంగ్ తెలిపింది. మొద‌టి 72 గంట‌ల్లోనే ఏకంగా 2.71 ల‌క్ష‌ల ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు పేర్కొంది. భార‌త్‌లో ఆయా డివైస్‌ల‌కు చెందిన ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఫోన్ల ధ‌రలు ఇవే..

గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 8 అల్ట్రా ఫోన్‌కు చెందిన 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,99,999 ఉండ‌గా, 12జీబీ, 512జీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.2,19,999గా నిర్ణ‌యించారు. 16జీబీ, 1టీబీ మోడ‌ల్ ధ‌ర రూ.2,59,999గా ఉంది. గెలాక్సీ జ‌డ్‌ఫోల్డ్ 8 ఫోన్‌కు చెందిన 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,79,999 ఉండ‌గా, 12జీబీ, 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,99,999గా ఉంది. 16జీబీ, 1టీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.2,39,999గా నిర్ణ‌యించారు. గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 8 ఫోన్‌కు చెందిన 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,24,999 ఉండ‌గా, 12జీబీ, 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,44,999గా ఉంది. ఈ ఫోన్లు గ్రాఫైట్‌, క్రీమ్‌, వ‌యోలెట్ షాడో, గ్రీన్ షాడో, లావెండ‌ర్‌, పిస్తాచియో, పింక్‌, మింట్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో అందుబాటులో ఉన్నాయి. వేరియెంట్‌ను బ‌ట్టి క‌ల‌ర్ ఆప్ష‌న్ ల‌భ్య‌త మారుతుంది.

వాచ్‌ల ధ‌ర‌లు ఎంతంటే..

గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 వాచ్ కేవ‌లం 47 ఎంఎం సైజ్‌లోనే అందుబాటులో ఉండ‌గా, దీనికి ఎల్‌టీఈ క‌నెక్టివిటీని అందించారు. టైటానియం సిల్వ‌ర్‌, టైటానియం గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో రూ.64,999 ధ‌ర‌కు అందుబాటులో ఉంది. గెలాక్సీ వాచ్‌9 మోడ‌ల్‌కు చెందిన 40ఎంఎం సైజ్ వేరియెంట్ బ్లూటూత్ వెర్ష‌న్ ధ‌ర రూ.37,999గా ఉంది. ఎల్‌టీఈ వేరియెంట్ ధ‌ర రూ.41,999గా ఉంది. 44ఎంఎం డిస్‌ప్లే సైజ్ బ్లూటూత్ వేరియెంట్ ధ‌ర రూ.40,999 ఉండ‌గా, ఎల్‌టీఈ వేరియెంట్ ధ‌ర రూ.44,999గా ఉంది.

ఆఫ‌ర్ల వివ‌రాలు..

ఫోన్ల‌పై రూ.8వేల వ‌ర‌కు అప్‌గ్రేడ్ బోన‌స్‌, 30 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ, రూ.7వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇవి మోడ‌ల్‌ను బ‌ట్టి మారుతాయి. వాచ్‌ల‌కు 24 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ ఆఫ‌ర్‌ను అందిస్తున్నారు. ఏవైనా రెండు డివైస్‌ల‌ను క‌లిపి కొనుగోలు చేస్తే మ‌ల్టీ బై ఆఫ‌ర్ కింద గ‌రిష్టంగా రూ.9,500 వ‌ర‌కు అద‌న‌పు రాయితీని సైతం పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement