Gallantry Awards | 1,057 మందికి కేంద్ర పతకాలు.. తెలంగాణ నుంచి 15 మంది ఎంపిక
Gallantry Awards | స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) పురష్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు గ్యాలంట్రీ పతకాలను (Gallantry Medals) కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం1,057 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను (Gallantry and Service Medals) అందజేయనున్నారు. తెలంగాణ నుంచి 15 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
Gallantry Awards | త్రినేత్ర.న్యూస్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) పురష్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు గ్యాలంట్రీ పతకాలను (Gallantry Medals) కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) ప్రకటించింది. ఇందులో శౌర్య పురస్కారాలు, రాష్ట్రపతి విశిష్ట సేవ పతకాలు (President’s Medal) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం1,057 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను (Gallantry and Service Medals) అందజేయనున్నారు. ఈ మేరకు అవార్డుల జాబితాను హోంశాఖ తాజాగా విడుదల చేసింది.
మొత్తం 1057లో 92 మంది రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నారు. 301 మందికి పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ (272 పోలీసు, 29 అగ్నిమాపక సిబ్బందికి), 664 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) అందించనున్నారు. ప్రాణాలను, ఆస్తులను కాపాడటం, నేరాలను నిరోధించడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కేంద్ర హోంశాఖ ఏటా శౌర్య అవార్డులను అందజేస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసులకు కూడా ఈ పతకాలు దక్కాయి. తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి 21 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన ముగ్గురు పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 10 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు. తెలంగాణ అదనపు డిప్యూటీ కమిషనర్ జోగుల నర్సయ్య, ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నారు. జూనియర్ కమాండోలు బి. సత్యరావు, కె. సందీప్ కుమార్, జె.వంశీకృష్ణ గ్యాలంట్రీ మెడల్స్‌కు ఎంపికయ్యారు.
ఏపీకి చెందిన ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 11 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు లభించనున్నాయి. ఏపీకి చెందిన ఐజీ గుడి విజయ్ కుమార్, ఐజీ బలంకారి వెంకట రామిరెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. హెడ్ కానిస్టేబుళ్లు కొర్లాన మహేశ్, పైడి శ్రీరామమూర్తి, అడారి హేమసుందర రావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్, ఆబోతుల అప్పలనాయుడు, రుతాల కన్నబాబుకు గ్యాలంట్రీ మెడల్స్ దక్కాయి. కాగా, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకాలన ప్రకటిస్తుంటుందన్న విషయం తెలిసిందే.
Also Read..
పండ్లు, కూరగాయల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణనే టాప్
పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..
గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Galaxy Z Fold 8 | గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..
- ●Fruit and vegetables | పండ్లు, కూరగాయల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణనే టాప్
- ●Vira Video | చాటలో బియ్యం చెరుగుతున్న అమ్మ.. కూతురు ఏం చేసిందో చూడండి..
- ●Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..
- ●RTC Bus | పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు

Galaxy Z Fold 8 | గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..

Fruit and vegetables | పండ్లు, కూరగాయల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణనే టాప్

Vira Video | చాటలో బియ్యం చెరుగుతున్న అమ్మ.. కూతురు ఏం చేసిందో చూడండి..

Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..






