త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rana | 13 ఏళ్ల నరకం నుంచి విముక్తి.. కన్నుమూసిన హరీశ్ రాణా

భారతదేశ న్యాయ, వైద్య చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిష్క్రియాత్మక కారుణ్య మరణం ఒక వ్యక్తికి ఆచరణలో అమలు కావడం ఇదే తొలిసారి.

J

National | Published On Mar 24, 2026, 6.57 pm IST

Harish Rana | 13 ఏళ్ల నరకం నుంచి విముక్తి.. కన్నుమూసిన హరీశ్ రాణా
Advertisement

Harish Rana | సుమారు 13 ఏండ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి 32 ఏండ్ల‌ హరీశ్ రాణా కారుణ్య మరణానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. ఈనేపథ్యంలో కుటుంబ సభ్యులు హరీశ్ రాణాకు తుది వీడ్కోలు పలికారు. 13 ఏళ్ల నరకం నుంచి హరీశ్ రాణాకు విముక్తి కల్పించే ప్రక్రియను మార్చి 16న మొదలు పెట్టారు. హరీశ్ రాణాను కృత్రిమ శ్వాస వ్యవస్థ నుంచి క్రమంగా తప్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలోనే మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఎలాంటి నొప్పి కలగకుండా, ఇబ్బంది పడకుండా ఉండేలా హరీశ్ రాణాకు లైఫ్ సపోర్ట్‌ను కొంచెం కొంచెంగా వైద్యులు తగ్గిస్తూ వచ్చారు. భారతదేశ న్యాయ, వైద్య చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిష్క్రియాత్మక కారుణ్య మరణం ఒక వ్యక్తికి ఆచరణలో అమలు కావడం ఇదే తొలిసారి.

ఎవరీ హరీశ్‌ రాణా?

ఢిల్లీకి చెందిన 32 ఏండ్ల‌ హరీశ్ రాణా.. చండీగఢ్‌ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న స‌మ‌యంలో, 2013 ఆగస్టు 20న ప్ర‌మాద‌వ‌శాత్తు పీజీ హాస్ట‌ల్‌ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ దవాఖాల్లో చికిత్స అందించినప్ప‌టికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటినుంచి కోమాలోనే ఉండిపోయాడు.

Also Read: Harish Rana Passive Euthanasia | చావే అతనికి విముక్తి.. హరీష్ రాణా కన్నీటి కథ ఇది

ఇన్నేండ్లుగా అతని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి చూసుకుంటున్నారు. అయితే జీవ‌చ్చ‌వంలా ప‌డి ఉన్న త‌మ కుమారుడిని కారుణ్య మరణానికి అనుమతించాలంటూ హ‌రీశ్ తల్లిదండ్రులు 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇదే విష‌య‌మై సుప్రీంకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. అయితే, హరీశ్‌ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో మళ్లీ దేశ అత్యున్న‌త‌ న్యాయస్థానానికి వెళ్లారు. మెడికల్‌ రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జ‌న‌వ‌రి 15న తీర్పును రిజ‌ర్వ్ చేశారు. మార్చి 11న హ‌రీశ్‌ కారుణ్య మ‌ర‌ణానికి అనుమ‌తిస్తూ తుది తీర్పును వెల్ల‌డించారు.

Also Read: Harish Rana | 13 ఏళ్ల న‌ర‌కం నుంచి హ‌రీశ్ రాణాకు విముక్తి.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న చివ‌రి వీడియో

Advertisement

తాజావార్తలు

Advertisement