త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rana | 13 ఏళ్ల న‌ర‌కం నుంచి హ‌రీశ్ రాణాకు విముక్తి.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న చివ‌రి వీడియో

Harish Rana | సుమారు 13 ఏండ్లుగా కోమాలో (Coma) ఉండి జీవచ్ఛవంలా మారిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి 32 ఏండ్ల‌ హరీశ్ రాణా (Harish Rana) కారుణ్య మరణానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కుటుంబ స‌భ్యులు హ‌రీశ్‌కు తుది వీడ్కోలు ప‌లికేందుకు (Emotional Farewell To Harish Rana) సిద్ధ‌మ‌య్యారు.

D

National | Published On Mar 16, 2026, 12.11 pm IST

Harish Rana | 13 ఏళ్ల న‌ర‌కం నుంచి హ‌రీశ్ రాణాకు విముక్తి.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న చివ‌రి వీడియో
Advertisement

Harish Rana | సుమారు 13 ఏండ్లుగా కోమాలో (Coma) ఉండి జీవచ్ఛవంలా మారిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి 32 ఏండ్ల‌ హరీశ్ రాణా (Harish Rana) కారుణ్య మరణానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కుటుంబ స‌భ్యులు హ‌రీశ్‌కు తుది వీడ్కోలు ప‌లికేందుకు (Emotional Farewell To Harish Rana) సిద్ధ‌మ‌య్యారు. 13 ఏళ్ల న‌ర‌కం నుంచి హ‌రీశ్‌రాణాకు విముక్తి క‌ల్పించే ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగానే హరీశ్‌ను కృత్రిమ శ్వాస వ్యవస్థ నుంచి క్రమంగా తప్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా అత‌డి త‌ల్లిదండ్రులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

ఆసుప‌త్రికి తీసుకెళ్లే ముందు రాణా కుటుంబ స‌భ్యులు అత‌డితో గిడిపిన చివ‌రి క్ష‌ణాల‌కు సంబంధించిన 22 సెక‌న్ల వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. అందులో బ్రహ్మకుమారి సోదరి హ‌రీశ్ నుదిటిపై తిల‌కం దిద్దింది. "అందరినీ క్షమించు, అందరినీ క్షమాపణ కోరుకో. ఇక వెళ్లాల్సిన సమయం వచ్చింది.. సరేనా?" అంటూ హ‌రీశ్ త‌ల‌ను నిమురుతూ ఆమె చెప్పిన మాట‌లు అక్క‌డున్న వారితో క‌న్నీళ్లు పెట్టించింది. ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

https://x.com/erbmjha/status/2033096147259257184

ఎవరీ హరీశ్‌ రాణా..

ఢిల్లీకి చెందిన 32 ఏండ్ల‌ హరీశ్ రాణా.. చండీగఢ్‌ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న స‌మ‌యంలో, 2013 ఆగస్టు 20న ప్ర‌మాద‌వ‌శాత్తు పీజీ హాస్ట‌ల్‌ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ దవాఖాల్లో చికిత్స అందించినప్ప‌టికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటినుంచి కోమాలోనే ఉండిపోయాడు.

ఇన్నేండ్లుగా అతని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి చూసుకుంటున్నారు. అయితే జీవ‌చ్చ‌వంలా ప‌డిఉన్న త‌మ కుమారుడిని కారుణ్య మరణానికి అనుమతించాలంటూ హ‌రీశ్ తల్లిదండ్రులు 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇదే విష‌య‌మై సుప్రీంకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. అయితే, హరీశ్‌ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో మళ్లీ దేశ అత్యున్న‌త‌ న్యాయస్థానానికి వెళ్లారు. మెడికల్‌ రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జ‌న‌వ‌రి 15న తీర్పును రిజ‌ర్వ్ చేశారు. మార్చి 11న హ‌రీశ్‌ కారుణ్య మ‌ర‌ణానికి అనుమ‌తిస్తూ తుది తీర్పును వెల్ల‌డించారు.

Also Read..

Assembly Budget Session | తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం

Shamshabad Airport | శంషాబాద్‌లో ప‌ట్టుబ‌డిన డ్రోన్లు.. మూడు రోజుల్లో రెండోసారి

Dubai Airport | డ్రోన్ అటాక్‌తో భారీ మంట‌లు.. దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత‌

Advertisement
Advertisement