త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kajal Aggarwal | “రామాయ‌ణ”లో కాజ‌ల్ రోల్‌పై విమ‌ర్శ‌లు – క్లారిటీ ఇచ్చిన చంద‌మామ‌

ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన రామాయ‌ణ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ గెస్ట్ రోల్‌లో క‌నిపించింది. మండోద‌రిగా ఆమె పాత్ర‌ను చూపించిన తీరు, స్క్రీన్ టైమ్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అవ‌కాశాలు లేక‌పోవ‌డం వ‌ల్లే గెస్ట్ రోల్‌లో కాజ‌ల్ న‌టించిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌పై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాజ‌ల్ క్లారిటీ ఇచ్చింది.

N

Entertainment | Published On Nov 7, 2026, 3.27 pm IST

Kajal Aggarwal | “రామాయ‌ణ”లో కాజ‌ల్ రోల్‌పై విమ‌ర్శ‌లు – క్లారిటీ ఇచ్చిన చంద‌మామ‌
Advertisement

Kajal Aggarwal |  రామాయ‌ణ మూవీలో త‌న రోల్ లెంగ్త్‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై కాజ‌ల్ అగ‌ర్వాల్ రియాక్ట్ అయ్యింది. ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన రామాయ‌ణ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వాల్మీకి రామాయ‌ణం ఆధారంగా ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ ఈ మైథాల‌జీ మూవీని రూపొందించారు. ఈ సినిమాలో రావ‌ణాసురుడి పాత్ర‌లో క‌న్న‌డ న‌టుడు య‌శ్ న‌టించాడు. య‌శ్ భార్య‌గా మండోద‌రి పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ గెస్ట్‌గా క‌నిపించింది.

ఫ్యాన్స్ ఫైర్‌...

కాజ‌ల్ పాత్రను రామాయ‌ణ‌లో చూపించిన తీరు, క్యారెక్ట‌ర్ నిడివిపై ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. రెండు సినిమాలు కూడా లెంగ్త్ లేని పాత్ర కోసం కాజ‌ల్ లాంటి స్టార్‌ను ఎందుకు తీసుకున్నారంటూ దర్శకనిర్మాతలపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం సినిమాల అవ‌కాశాలు లేక‌పోవ‌డంతోనే కాజ‌ల్ డైలాగ్స్ కూడా లేని గెస్ట్ రోల్ చేసిందంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ రూమ‌ర్ల‌పై కాజ‌ల్ రియాక్ట్ అయ్యింది.

నిడివి పెద్ద‌దా...చిన్న‌దా...

"క్యారెక్ట‌ర్ స్క్రీన్ టైమ్‌ అన్ని సినిమాల్లో ఒకేలా ఉండాలంటే కుదర‌దు. కొన్నిసార్లు పాత్ర‌ నిడివి పెద్ద‌దా...చిన్న‌దా అన్న‌ది కాకుండా ఆ క‌థ గొప్ప‌త‌నం...దానిని వెండితెర‌పై ఆవిష్కృతం చేసేందుకు చిత్ర బృందం ప‌డిన క‌ష్టాన్నిమాత్ర‌మే చూడాలి. రామాయ‌ణ‌లో నా పాత్ర చిన్నదే కావచ్చు కానీ... మన సంస్కృతి, చరిత్రతో ముడిప‌డిన ఓ గొప్ప ఇతిహాసంలో భాగం కావ‌డం అదృష్టంగా భావించా. ఆ ఆలోచ‌న‌తోనే స్క్రీన్‌టైమ్ గురించి ప‌ట్టించుకోకుండా సినిమా చేశా"అని చెప్పింది. రామాయ‌ణ‌లో మండోద‌రి పాత్ర కోసం రెడీ అవుతోన్న కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.

 

Advertisement
Advertisement