Priyanka Chopra | నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి సీక్వెల్ – ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మరాఠీ మూవీ వెంటిలేటర్‌కు పదకొండేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. వెంటిలేటర్ 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించబోతుంది. ఈ సీక్వెల్‌లో ప్రియాంక చోప్రా గెస్ట్ రోల్ చేయబోతుంది.
Entertainment | Published On Nov 7, 2026, 2.30 pm IST
Priyanka Chopra |2015లో రిలీజైన మరాఠీ మూవీ వెంటిలేటర్ మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కేవలం మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 25 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మరాఠీ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. రాజేష్ మపూస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన తల్లి మధు చోప్రాతో కలిసి నిర్మించింది. నిర్మాతగా ఆమెకు భారీగా ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టింది.
పదకొండేళ్ల తర్వాత...
దాదాపు పదకొండేళ్ల తర్వాత వెంటిలేటర్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. వెంటిలేటర్ 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌ను ప్రియాంక చోప్రా అఫీషియల్‌గా ప్రకటించింది. తమ నిర్మాణ సంస్థ పర్పుల్ పెబెల్ బ్యానర్‌లో వచ్చిన గొప్ప సినిమాల్లో వెంటిలేటర్ ఒకటని, దశాబ్దం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేయబోతుండటం ఆనందంగా ఉందని చెప్పింది. కొత్త అనుభవాలు, కథతో వెంటిలేటర్ 2 ఉంటుందని అన్నది.
గెస్ట్ రోల్...
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక చోప్రా నిర్మిస్తోన్న మరాఠీ మూవీ ఇది. 2027లో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పార్ట్ వన్‌లో ప్రియాంక చోప్రా గెస్ట్‌గా నటించింది. ఈ సీక్వెల్‌లో ఎక్కువ నిడివితో కూడిన అతిథి పాత్రలో గ్లోబల్ స్టార్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వెంటిలేటర్‌పై
కామేర్కర్ అనే ఉమ్మడి కుటుంబం చుట్టూ వెంటిలేటర్ మూవీ సాగింది. గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని ఎన్నో ఆశలతో కామేర్కర్ కుటుంబసభ్యులు ఎదురుచూస్తుంటారు. అదే టైమ్‌లో కుటుంబ పెద్ద గుజ్జు కాకా హాస్పిటల్ పాలవుతాడు. గణేష్ ఉత్సవాలు జరిగే వరకు గుజ్జు కాకాను బతికించుకోవాలని వెంటిలేటర్‌పై అతడిని ఉంచుతారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో జరిగిన గొడవలు, ఎమోషన్స్‌తో దర్శకుడు రాజేష్ మాపూస్కర్ ఈ సినిమాను తెరకెక్కించారు. కామేర్కర్ ఫ్యామిలీ చుట్టే ఈ సీక్వెల్ సాగనున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Salman Khan | “మాతృభూమి” సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? – రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్
నవంబర్ 6, 2026

Salman Khan | సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ క్లియరెన్స్ – లాంగెస్ట్ రన్టైమ్తో ట్రైలర్
నవంబర్ 5, 2026

Anurag Kashyap | చిక్కుల్లో చిరంజీవి “కాకా” విలన్ – వారెంట్ జారీ చేసిన కోర్టు
నవంబర్ 3, 2026
తాజావార్తలు
- ●CID Rides | ధరణి పోర్టల్ అక్రమాల్లో కీలక సమాచారం లభ్యం.. కేసు నమోదు చేసిన సీఐడీ
- ●Sharad Pawar | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శరద్ పవార్
- ●హైదరాబాద్‌లో రాహుల్ గ్లోబల్ స్కెచ్! భారత్ సమ్మిట్ వెనుక అసలు వ్యూహమేంటి?
- ●Foreign Investors | భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల వెల్లువ.. కారణాలేమిటి..?
- ●Diwali celebrations in Indiramma Houses | కోమల-సమ్మయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి జరుపుకున్నా.. చాలా సంతోషంగా ఉంది
- ●Actor Dhanush | నాకు ఏ పార్టీ మద్దతూ లేదు.. నా వెనుక బలమైన అభిమాన గణం ఉంది : ధనుష్

CID Rides | ధరణి పోర్టల్ అక్రమాల్లో కీలక సమాచారం లభ్యం.. కేసు నమోదు చేసిన సీఐడీ

Sharad Pawar | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శరద్ పవార్

హైదరాబాద్‌లో రాహుల్ గ్లోబల్ స్కెచ్! భారత్ సమ్మిట్ వెనుక అసలు వ్యూహమేంటి?

Foreign Investors | భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల వెల్లువ.. కారణాలేమిటి..?



