Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. దర్యాప్తు నివేదికను అతి త్వరలోనే వెల్లడిస్తాం : కేంద్రం
Air India plane crash | గతేడాది జూన్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India plane crash)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విచారణ వేగంగా జరుగుతోందని కేంద్రం వెల్లడించింది.
Air India plane crash | గతేడాది జూన్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India plane crash)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విచారణ వేగంగా జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. దర్యాప్తు నివేదికను (plane crash probe report) అతి త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Minister) రామ్మోహన్ నాయుడు (K Rammohan Naidu) నేడు రాజ్యసభ (Rajya Sabha)కు తెలియజేశారు. "గత ఏడాది జూన్‌లో జరిగిన AI171 ప్రమాదంపై ఏఏఐబీ విచారణ చాలా వేగంగా జరుగుతోంది. దర్యాప్తు సంస్థకు అవసరమైన అన్ని వనరులను మంత్రిత్వ శాఖ సమకూరుస్తోంది. ఏడాది పూర్తయ్యేలోపు.. అంటే అతి త్వరలోనే దర్యాప్తు నివేదికను వెల్లడిస్తాము" అని తెలిపారు.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. మిడిల్ ఈస్ట్‌లోని పరిస్థితులపై కూడా మాట్లాడారు. పశ్చిమాసియా (Middle East)లో యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే, భద్రతకే పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నాయన్నారు. డీజీసీఏ (Directorate General of Civil Aviation) అధికారులు ఎయిర్‌లైన్స్ ఎగ్జిక్యూటివ్‌లతో పలుమార్లు సమావేశమైనట్లు చెప్పారు. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలకు రాకపోకలు సాగించేటప్పుడు వంద శాతం భద్రత ఉండేలా చూసుకున్న తర్వాతే విమానాలను నడపాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. అంతేకాదు, ప్రయాణికులు గందరగోళానికి గురికాకుండా.. ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లోనే సుమారు 90 వేల మంది భారత్‌కు చేరుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో అక్కడ పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నట్లు చెప్పారు.
Also Read..
Namibian cheetah | రోజుకు రూ.35వేల మేకల్ని తింటున్న చీతాలు..!
కోట్ల ఆస్తులున్నా.. కొడుకు అద్దె ఇంట్లో - కూతురు హాస్టల్‌లో - దళపతి విజయ్ ఫ్యామిలీ తలో దిక్కు
2025లో అత్యధిక జననాలు భారత్‌లోనే.. ప్రపంచంలోనే మళ్లీ నంబర్ వన్.. టాప్-10 దేశాలు ఇవే!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | ఒకే రూట్‌కు ధరల్లో తేడాలెందుకు? విమానాల చార్జీలపై సుప్రీం సీరియస్..!
మే 15, 2026

Petrol Price Hike | బిగ్ అలర్ట్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? లీటరుపై రూ. 28 బాదుడు.. ఎప్పటి నుంచంటే..?
ఏప్రిల్ 23, 2026

Parliament Session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఉభయసభలు నిరవధిక వాయిదా
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



