త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Global Births in 2025 | 2025లో అత్యధిక జననాలు.. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్, టాప్-10 దేశాలు ఇవే..!

ఐక్యరాజ్యసమితి 'వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024' తాజా నివేదిక ప్రకారం, 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అంచనా వేయబడిన జననాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో భారత్‌లో ఏకంగా 23 మిలియన్ల జననాలు నమోదు అయినట్లు అంచనా. చైనా, నైజీరియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆసక్తికరమైన జనాభా గణాంకాల గురించి ఓ లుక్కేయండి.

J

Viral news | Published On Mar 9, 2026, 3.45 pm IST

Global Births in 2025 | 2025లో అత్యధిక జననాలు.. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్, టాప్-10 దేశాలు ఇవే..!
Advertisement

Global Births in 2025 : త్రినేత్ర.న్యూస్ : ప్రపంచ జనాభా లెక్కల్లో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితికి చెందిన 'వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024' (UN World Population Prospects 2024) డేటా ఆధారంగా 2025 సంవత్సరానికి సంబంధించిన గ్లోబల్ బర్త్స్ (జననాలు) నివేదిక విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 132.31 మిలియన్ల (13 కోట్ల 23 లక్షలకు పైగా) జననాలు నమోదు అయ్యాయి. ఇందులో భారతదేశం అత్యధిక జననాలతో అగ్రస్థానంలో దూసుకెళ్లింది.

టాప్‌లో భారత్.. చైనా పరిస్థితి ఏంటి?

జనాభాలో ఇప్పటికే చైనాను దాటేసిన భారత్, కొత్త జననాల్లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ నివేదిక ప్రకారం, 2025లో భారతదేశంలో అత్యధికంగా 23.07 మిలియన్ల (2 కోట్ల 30 లక్షలకు పైగా) జననాలు రికార్డు అయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. ఇది ప్రపంచంలోని మరే ఇతర దేశంతో పోల్చినా చాలా ఎక్కువే కావడం విశేషం.

ఒకప్పుడు జనాభాలో నంబర్ వన్ స్థానంలో ఉన్న చైనా, ఇప్పుడు జననాల సంఖ్యలో భారీగా వెనుకబడింది. 2025లో చైనాలో కేవలం 8.71 మిలియన్ల జననాలు మాత్రమే నమోదు కాగా,  ఈ జాబితాలో నైజీరియా 7.64 మిలియన్లతో మూడో స్థానంలో, దాయాది దేశం పాకిస్థాన్ 6.91 మిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా 3.66 మిలియన్ల జననాలతో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.

2025లో అత్యధిక జననాల టాప్ 10 దేశాలు ఇవే

  • భారత్ (India) - 23.07 మిలియన్లు
  • చైనా (China) - 8.71 మిలియన్లు
  • నైజీరియా (Nigeria) - 7.64 మిలియన్లు
  • పాకిస్థాన్ (Pakistan) - 6.91 మిలియన్లు
  • డి.ఆర్. కాంగో (DR Congo) - 4.56 మిలియన్లు
  • ఇండోనేషియా (Indonesia) - 4.44 మిలియన్లు
  • ఇథియోపియా (Ethiopia) - 4.18 మిలియన్లు
  • అమెరికా (United States) - 3.66 మిలియన్లు
  • బంగ్లాదేశ్ (Bangladesh) - 3.44 మిలియన్లు
  • బ్రెజిల్ (Brazil) - 2.53 మిలియన్లు

ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోనే ఎక్కువ

ఈ నివేదికను గమనిస్తే, ఆఫ్రికా, ఆసియా ఖండాలకు చెందిన దేశాల్లోనే జననాల రేటు అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈజిప్ట్ (2.45 మిలియన్లు), రష్యా (1.24 మిలియన్లు), జపాన్ (7,48,000), యూకే (6,80,000) వంటి ఇతర ప్రధాన దేశాలు ఈ జాబితాలో తమ స్థానాలను నమోదు చేసుకున్నాయి.

(గమనిక: ఈ డేటా ఐక్యరాజ్యసమితి 2024 అంచనాల ఆధారంగా రూపొందించబడింది. అయితే 2025 లో అంచనాలకు తగ్గట్టుగానే అన్ని దేశాల్లో జననాలు నమోదయ్యాయి.)

Advertisement
Advertisement