Thalapathy Vijay | కోట్ల ఆస్తులున్నా.. కొడుకు అద్దె ఇంట్లో – కూతురు హాస్టల్‌లో – దళపతి విజయ్ ఫ్యామిలీ తలో దిక్కు
విడాకుల గొడవ వల్ల దళపతి విజయ్ ఫ్యామిలీ మొత్తం తలో దిక్కు అయినట్లు ప్రచారం జరుగుతోంది.విజయ్ భార్య సంగీత లండన్‌కు వెళ్లిపోగా...కొడుకు సంజయ్ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడట. కూతురు పెయింగ్ గెస్ట్‌గా ఓ హాస్టల్‌లో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజం లేదని విజయ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
Entertainment | Published On Mar 9, 2026, 4.19 pm IST
Thalapathy Vijay | దళపతి విజయ్ విడాకుల వార్తలు కోలీవుడ్‌ను కుదిపేస్తోన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముంగిట విజయ్ నుంచి విడాకులు కోరుతూ అతడి భార్య సంగీత కోర్టులో పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే మొదటి సారి పోటీ చేయబోతుంది. ఈ విడాకుల ఎఫెక్ట్ విజయ్‌తో పాటు అతడి పార్టీపై ఎంత వరకు ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది.
త్రిషనే కారణమా...
మరోవైపు దళపతి విజయ్, సంగీత విడాకులకుహీరోయిన్ త్రిషనే కారణమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి రెండు, మూడు రోజులు కాకముందే త్రిషతో కలిసి విజయ్ ఓ పెళ్లి వేడుకలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. త్రిషతో చాలా కాలంగా విజయ్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని, ఆమె కారణంగానే భార్యా పిల్లలను విజయ్ దూరం పెట్టినట్లు చెబుతోన్నారు.
అనుమతించడం లేదు...
మరోవైపు విడాకులు మంజూరు అయ్యే వరకు అయినా తన పిల్లలతో కలిసి చెన్నైలోని నీలంకరైలో ఉన్న విజయ్ ఇంట్లో తాను ఉండే అవకాశం కల్పించాలంటూ సంగీత ఇటీవల కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. తాను బ్రిటీష్ సిటిజన్ కావడంతో చెన్నైలో తనకంటూ సొంత ఇళ్లు లేదని, విజయ్ ఇంట్లో తనకు సమాన వాటా ఉన్నా ఇంటి లోపలికి తనను విజయ్‌తో పాటు అతడి ఫ్యామిలీ మెంబర్స్ అనుమతించడం లేదంటూ సంగీత ఈ పిటిషన్‌లో పేర్కొన్నది.
చిన్నాభిన్నాం...
కాగా విడాకుల గొడవ వల్ల విజయ్ కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్‌తో మనస్పర్థల కారణంగా భార్య సంగీత గత రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోన్నట్లు సమాచారం. చాలా కాలంగా ఆమె లండన్‌లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటుదని అంటున్నారు.
మరోవైపు విజయ్ పిల్లలు కూడా తల్లిదండ్రులకు దూరంగా చెన్నైలో ఒంటరిగా ఉంటున్నార. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ చెన్నైలోని వరసలవక్కం ఏరియాలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని నివసిస్తున్నట్లు చెబుతోన్నారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రిని అన్‌ఫాలో చేశాడు జాసన్ సంజయ్. కూతురు దివ్య సాషా కూడా పెయింగ్ గెస్ట్‌గా ఓ హాస్ట్‌ల్‌లో ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభ కూడా కొడుకు నుంచి వేరుగా ఉండబట్టి చాలా రోజులే అవుతోంది.
వ్యక్తిత్వాన్ని కించపరచడానికే...
విజయ్ కొడుకు అద్దె ఇంట్లో...కూతురు పెయింగ్ గెస్ట్‌గా ఉంటోన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని ప్రచారం జరుగుతోంది. సంగీతం మొత్తం ఆస్తుల విలువ 400 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. విజయ్‌తో సమానంగా ఆమెకు ఆస్తులు ఉన్నప్పుడు చెన్నైలో సొంత ఇళ్లు కొనలేదా అని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నాయి. విజయ్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడంతో పాటు సింపథీ కోసమే ఇలాంటి కథనాలను కొందరు ప్రచారం చేయిస్తున్నారని అతడి అభిమానులు కామెంట్లు పెడుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
మే 19, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



