Gaurav Gogoi | డీలిమిటేషన్‌ను రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు.. కేంద్రంపై గౌరవ్ గొగోయ్ ఫైర్
Gaurav Gogoi | కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరుగుతోంది. ఈ చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడేళ్ల క్రితం ఇవే చర్చలు జరిగాయని చెప్పారు.
Gaurav Gogoi | కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరుగుతోంది. ఈ చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడేళ్ల క్రితం ఇవే చర్చలు జరిగాయని చెప్పారు. అప్పుడు చెప్పినవే ఇవాళ న్యాయశాఖ మంత్రి చదివి వినిపించారని అన్నారు. మూడేళ్లలో ఏం మారింది..? ఎందుకు నిర్ణయం మార్చారు..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.
"మహిళా బిల్లు సభలో ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ మహిళా బిల్లుపై చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెడుతున్నారు. జనగణన తర్వాత డీలిమిటేషన్ ఉంటుందని గతంలో ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్లకు దీనిని లింక్ పెట్టి గందరగోళం సృష్టిస్తోంది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే ఇన్ని మెలికలు పెడుతోంది. మహిళా రిజర్వేషన్ ముసుగులో డీలిమిటేషన్ బిల్లు తెచ్చారు. హడావుడిగా ఈ బిల్లు తేవాల్సి అవసరం ఏముంది..? డీలిమిటేషన్‌ను రాజకీయ అస్త్రంగా ప్రభుత్వం వాడుకుంటోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిసి దీన్ని బలవంతంగా రుద్దాలని చూస్తోంది. 815 స్థానాలు వస్తాయని కేంద్రం ఎలా నిర్ణయిస్తుంది..? జనగణన, కులగణనకు కేంద్రం వ్యతిరేకం" అని గౌరవ్ గొగోయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అందుకు మేం వ్యతిరేకం కాదు..
అదే సమయంలో మహిళా రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన నాటినుంచే వాటిని అమలుచేయాలని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను లోక్‌సభ స్థానాల పెంపునకు ముడిపెట్టొద్దని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా డీలిమిటేషన్‌తో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే రాజ్యాంగ సవరణలు ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ‘బుల్డోజర్’ తరహాలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి..
మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో రాజకీయ ప్రాతినిధ్యాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ను ఒక 'ఆయుధంగా' వాడుకుంటోందని గౌరవ్ గొగోయ్ ఆరోపించారు . జమ్మూ కాశ్మీర్, అస్సాం రాష్ట్రాలను ఉదాహరణలుగా చూపుతూ.. కేవలం కోటాను అమలు చేయడానికే కాకుండా, రాజకీయంగా నియోజకవర్గాల సరిహద్దులను రూపొందించడానికి డీలిమిటేషన్‌ను బలవంతంగా రుద్దుతున్నారని వాదించారు. ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్య ఆధారంగా మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. "మీరు 2023లోనే మా మాట విని ఉంటే.. 2024 నాటికే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేవి. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకండి. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయండి. ప్రస్తుతం ఉన్న 543 మంది సభ్యుల బలంతోనే దీన్ని అమలు చేయాలి. మేము కూడా పూర్తి మద్దతిస్తాం" అని ఆయన అన్నారు.
Also Read..
మహిళా రిజర్వేషన్ల అమలుకు సమయం వచ్చింది : అర్జున్ రామ్ మేఘ్‌వాల్
ఈ విషయంలో మా వైఖరిని స్పష్టం చేశాం.. డీలిమిటేషన్‌పై సోనియా గాంధీ
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ప్రతిపక్షం బహిష్కరిస్తుంది : జైరాం రమేష్
సంబంధిత వార్తలు

Gaurav Gogoi | అస్సాంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఓటమి..
మే 4, 2026

MP Chamala Kiran Kumar Reddy | మహిళా రిజర్వేషన్లకు కాదు.. మేం డీలిమిటేషన్కే వ్యతిరేకం: ఎంపీ చామల
ఏప్రిల్ 19, 2026

MP Chamala Kiran Kumar Reddy | మీ విధానం క్రాస్ బ్రీడ్, క్రాస్ ఓటింగ్: హరీశ్‌రావుకు ఎంపీ చామల కౌంటర్
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



