MP Chamala Kiran Kumar Reddy | మీ విధానం క్రాస్ బ్రీడ్, క్రాస్ ఓటింగ్: హరీశ్‌రావుకు ఎంపీ చామల కౌంటర్
MP Chamala Kiran Kumar Reddy | రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం క్రాస్ బ్రీడ్ అంటున్న హరీశ్ రావు(Harish Rao)కు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) గట్టి కౌంటరిచ్చారు(counter). క్రాస్ బ్రీడ్ క్రాస్ ఓటింగ్ (Cross voting) చేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిందని ఎద్దేవా చేశారు.
త్రినేత్ర.న్యూస్: రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం క్రాస్ బ్రీడ్ అంటున్న హరీశ్ రావు (Harish Rao)కు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) గట్టి కౌంటరిచ్చారు (counter). క్రాస్ బ్రీడ్ క్రాస్ ఓటింగ్ (Cross voting) చేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిందని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశ ప్రజలను ఏకం చేయడాన్ని హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మళ్లీ, మళ్లీ ఉండాలి.. కేసీఆర్ ఎప్పటికి ఫామ్ హౌస్ కు పరిమితం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
హరీశ్.. వేరే పార్టీల నేతల ఇళ్లకు వెళ్లలేదా?
హరీశ్‌రావు రోజూ ఏదో ఒకటి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లును పెట్టి మహిళా బిల్లుగా బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంటున్నాయి. బిల్లును అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. బీజేపీ కుట్రలను ఎండగట్టాము. మీ నాయకుడు ఫామ్ హౌస్ లో ఉన్నారు. మీకు లోక్ సభలో ఒక్క ఎంపీ లేరు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు పిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. దాన్ని హరీశ్‌రావు తప్పు పడుతున్నారు. అక్కడ బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇచ్చారు. గతంలో హరీశ్‌రావు వేరే పార్టీల నాయకుల ఇళ్లకు వెళ్లలేదా అని చామల ప్రశ్నించారు.
నేనే స్వయంగా స్పీకర్ సమయం తీసుకున్నా...
ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామని కళలు కన్నారు. మా మామ తర్వాత నేను సీఎం అవుతా, లేకపోతే మా కుటుంబ సభ్యులు అవుతారని హరీశ్‌రావు భావించారు. కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించింది. తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడారు. నేను స్వయంగా స్పీకర్ వద్ద సమయం తీసుకుని తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశాను. పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఆందోళన చేశాం. స్పీకర్ ను కలిసి తేజస్వి సూర్యపై ఫిర్యాదు చేశాం. మీ గత పాలన చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు. మీ కుటుంబ పాలనతో తెలంగాణకు ఎప్పటికి మర్చిపోలేని గాయం అయింది అని చామల పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
నవంబర్ 28, 2026

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



