త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kiran Kumar Reddy | మహిళా రిజర్వేషన్లకు కాదు.. మేం డీలిమిటేషన్‌కే వ్యతిరేకం: ఎంపీ చామ‌ల‌

MP Chamala Kiran Kumar Reddy | తాము మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌(Women's reservations)కు వ్య‌తిరేకం కాద‌ని.. కేవ‌లం డీలిమిటేష‌న్‌(Delimitation)కే వ్య‌తిరేక‌మ‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాని మోదీ (PM Modi) దుష్ప్ర‌చారాన్ని తెలంగాణ‌, భువ‌న‌గిరి మ‌హిళా లోకం ప‌ట్టించుకోవ‌ద్ద‌ని కోరారు.

S

News | Published On Apr 19, 2026, 1.35 pm IST

MP Chamala Kiran Kumar Reddy | మహిళా రిజర్వేషన్లకు కాదు.. మేం డీలిమిటేషన్‌కే వ్యతిరేకం: ఎంపీ చామ‌ల‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తాము మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌(Women's reservations)కు వ్య‌తిరేకం కాద‌ని.. కేవ‌లం డీలిమిటేష‌న్‌(Delimitation)కే వ్య‌తిరేక‌మ‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాని మోదీ (PM Modi) దుష్ప్ర‌చారాన్ని తెలంగాణ‌, భువ‌న‌గిరి మ‌హిళా లోకం ప‌ట్టించుకోవ‌ద్ద‌ని కోరారు. తమిళనాడు, ప‌శ్చిమ‌ బెంగాల్ ఎన్నికల లబ్ధి కోసమే ప్ర‌ధాని మోదీ 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టారని విమ‌ర్శించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మాహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, 2024 తర్వాత ఎందుకు అమలు చేయలేదని ప్ర‌శ్నించారు.

2027 జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిందే మోదీ, అమిత్ షా. 33 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అమలు చేసినా మాకు ఇబ్బంది లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న సాయంత్రం మహిళల గురించి మాట్లాడారు. 2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. కానీ మోదీ తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదు అని చామ‌ల పేర్కొన్నారు.

543 లోక్ సభ స్థానాలకు 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఇద్దరు లోక్ సభ సభ్యులు తప్పా అందరూ ఒప్పుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది. మేము డీలిమిటేషన్ చేయాలంటే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలి. ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య అంతరం లేకుండా డీలిమిటేషన్ చేయండి. గతంలో ఇందిరాగాంధీ, వాజ్ పాయ్ అనుసరించిన విధానాలను అమలు చేయండి. డీలిమిటేషన్ ను ఇష్టం వచ్చినట్లు చేసుకుని ఎప్పటికీ అధికారంలో ఉండాలని బీజేపీ భావించడం వల్లే మేము వ్యతిరేకించాం.

తెలంగాణ, భువనగిరి మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా మేం ఎప్పటికీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. బీజేపీ చేసే దుష్ప్రచారాన్ని మహిళలు పట్టించుకోవద్దు. ఎస్.ఐ.ఆర్ ను ఏ విధంగా అమలు చేసి తమ ఇష్టం వచ్చినట్లు ఓట్లు తొలగించారో డీలిమిటేషన్ ద్వారా తమ ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలని ప్రయత్నం చేశారు అని చామల ఆరోపించారు.

Advertisement
Advertisement