Suicide | వరకట్నం వేధింపులు.. పెళ్లైన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Suicide | తన బిడ్డ భవిష్యత్ బాగుండాలని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేశాడు. వరుడు సంతృప్తి చెందే విధంగా కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. కానీ పెళ్లైన మరుసటి రోజు నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ వధువు 18 రోజులకే తనువు చాలించింది.
Suicide | త్రినేత్ర.న్యూస్ : తన బిడ్డ భవిష్యత్ బాగుండాలని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేశాడు. వరుడు సంతృప్తి చెందే విధంగా కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. కానీ పెళ్లైన మరుసటి రోజు నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ వధువు 18 రోజులకే తనువు చాలించింది. ఈ విషాద ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్ రెడ్డి కుమార్తె పల్లవి(20) కేపీఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే కానిస్టేబుల్ సంబంధం రావడంతో పల్లవికి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 30న చైతన్యపురి పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీకాంత్ రెడ్డితో పెళ్లి చేశారు. వివాహం అయ్యాక ఒకట్రెండు రోజులు మంచిగానే ఉన్నారు.
ఇక మూడో రోజు నుంచి పల్లవికి అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. శారీరకంగా, మానసికంగా హింసించాడు. భర్త వేధింపులు భరించలేక పల్లవి.. తాను చదువుతున్న ఇంజినీరింగ్ కాలేజీ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- ●IIT Bombay Student | పరీక్షలో చాట్‌జీపీటీ వాడుతూ అడ్డంగా దొరికిపోయి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య
- ●Hafizpet | మహిళను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్
- ●Medak | భర్త కళ్లలో కారం చల్లి.. కుమారుడితో కలిసి దారుణ హత్య
- ●Rangareddy | వైన్ షాపులో చెలరేగిన మంటలు.. రూ. 1.2 కోట్ల మద్యం అగ్నికి ఆహుతి
- ●Kazipeta | కాజీపేటలో రూ. 1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ పట్టివేత
- ●Apple Pay | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ పే సేవలు..

IIT Bombay Student | పరీక్షలో చాట్‌జీపీటీ వాడుతూ అడ్డంగా దొరికిపోయి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య

Hafizpet | మహిళను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్

Medak | భర్త కళ్లలో కారం చల్లి.. కుమారుడితో కలిసి దారుణ హత్య

Rangareddy | వైన్ షాపులో చెలరేగిన మంటలు.. రూ. 1.2 కోట్ల మద్యం అగ్నికి ఆహుతి





