త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీల‌పై కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చిన కేంద్రం

UPI payments | యూపీఐ (UPI) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ను ప్రవేశపెట్టడం వెనుక ఎలాంటి విదేశీ ఒత్తిడీ (No foreign influence) లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Sep 16, 2026, 4.24 pm IST

UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీల‌పై కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చిన కేంద్రం
Advertisement

UPI payments | త్రినేత్ర‌.న్యూస్ : యూపీఐ (UPI) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ను ప్రవేశపెట్టడం వెనుక విదేశీ ప్రమేయం ఉందంటూ ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. ఈ నిర్ణ‌యం వెనుక ఎలాంటి విదేశీ ఒత్తిడీ (No foreign influence) లేద‌ని స్ప‌ష్టం చేసింది. యూపీఐ విధానపరమైన నిర్ణయాలను భారత్ స్వతంత్రంగానే తీసుకుంటుందని తెలిపింది. వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ స‌ర్కార్ ఈ నిర్ణయం తీసుకుందంటూ ప్రతిపక్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ నేపథ్యంలో ప్రభుత్వం ఈమేర‌కు స్పష్టతనిచ్చింది.

యూపీఐ పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) జారీ చేసిన సర్క్యులర్ అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ (UPI) లావాదేవీలపై 0.4% ఎండీఆర్ (MDR) ఫీజు విధిస్తారు. అయితే, ఈ ఛార్జీని కేవలం వ్యాపారులు (మర్చంట్స్) మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని.. వినియోగదారులపై ఎలాంటి భారం పడదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షాలు కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

యూపీఐ (UPI) డిజిటల్ చెల్లింపులపై జీరో-ఎండీఆర్ (zero-MDR) విధానాన్ని ఎత్తివేయాలని కేంద్రం భావిస్తోందని, ఇది అమెరికా ఒత్తిడికి తలవంచడమేనని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరామ్ ర‌మేష్‌ ఆరోపించారు. అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్, వీసా వంటి పెద్ద ఆర్థిక సంస్థలకు ప్రయోజనం చేకూర్చడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటోందని విమర్శించారు. యూఎస్ వాణిజ్య ప్రతినిధి కార్యాలయం గతంలో యూపీఐ ఉచితంగా ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. అందువల్లే ట్రంప్ ఒత్తిడికి త‌లొగ్గి ఈ నిర్ణయం వెలువడిందని ఆరోపించారు.

Also Read..

రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?

సుప్రీంకోర్టులో 'ఓటుకు కోట్లు' కేసు విచారణ.. గంటన్నరపాటు సాగిన లూత్ర వాదనలు

నోటాకు ప్ర‌ధాని కొత్త అర్థం చెప్పారు.. యూపీఐ ఛార్జీల‌పై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు

Advertisement
Advertisement