Heavy Traffic | ట్రాఫిక్ జామ్.. మంత్రిని నడిరోడ్డుపై కడిగిపారేసిన మహిళ
Heavy Traffic | మహారాష్ట్ర ముంబైలో జరిగిన ఓ రాజకీయ ర్యాలీ ఓ మహిళ (Frustrated Mumbai woman)కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఏకంగా ఆ రాష్ట్ర మంత్రి, పోలీసు అధికారులను ఆమె నడిరోడ్డుపైనే నిలదీశారు.
Heavy Traffic | మహారాష్ట్ర ముంబైలో జరిగిన ఓ రాజకీయ ర్యాలీ ఓ మహిళ (Frustrated Mumbai woman)కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఏకంగా ఆ రాష్ట్ర మంత్రి, పోలీసు అధికారులను ఆమె నడిరోడ్డుపైనే నిలదీశారు. గెట్ అవుట్ అంటూ వారిపై విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..? మహిళా రిజర్వేషన్లపై అధికార మహాయుతి కూటమి ఆధ్వర్యంలో వర్లి (Worli) ప్రాంతంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ఆ రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ (Maharashtra minister Girish Mahajan) హాజరయ్యారు. ఈ ర్యాలీకి కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది (heavy traffic). దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే నిలిచిపోయారు.
గెట్ అవుట్..
తన పిల్లల్ని తీసుకురావడానికి పాఠశాలకు వెళ్తున్న ఆ మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఆమె సహనం కోల్పోయింది. నేరుగా మంత్రి, పోలీసుల వద్దకు వెళ్లి నడిరోడ్డుపైనే వారిని నిలదీసింది. మంత్రితో వాగ్వాదానికి దిగింది. మీ ర్యాలీ కారణంగా మేము ఇబ్బందులు పడాలా..? అంటూ వారిపై విరుచుకుపడింది. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ వారిపై ఫైర్ అయ్యింది. మంత్రిని నిలదీయడమేకాదు.. మన దేశంలో రాజకీయ వ్యవస్థని ఆమె ఎండగట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉందా..?
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎన్నికల ప్రచారాలు, నిరసన పేరుతో ఇలా ర్యాలీలు, సభలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రాజకీయ నాయకులను ఇలానే నిలదీయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే తెలుగు రాష్ట్రాల్లో ఇలా ప్రశ్నించే, నిలదీసే పరిస్థితి ఉందా..? అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ప్రశ్నించడం అంటే? ఇదీ నిలదీయడం అంటే.. ఈ మహిళకు నిజంగా హేట్సాఫ్ చెప్పాలి అంటూ అభిప్రాయపడుతున్నారు.
ఇదీ … ప్రశ్నించడం అంటే ? ఇదీ నిలదీయడం అంటే.. ఈ మహిళకు నిజంగా హేట్సాఫ్ చెప్పాలి ..
ముంబై వీధుల్లో మంత్రి గిరీష్ మహాజన్ మహిళా రిజర్వేషన్ల పై ర్యాలీ చేస్తుంటే ... ట్రాఫిక్ జామ్ వల్ల అసహనానికి గురైన ఒక మహిళ, అందరి ముందూ ఆయన్ని నిలదీశారు. నిలదీయడం మాత్రమే కాదు రాజకీయ వ్యవస్థని… pic.twitter.com/UaXYGq20eN— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) April 22, 2026
Also Read..
కేసీఆర్ మల్లెపువ్వులా బయటికి వస్తారు
యుద్ధం టెన్షన్.. తీవ్ర ఒత్తిడిలో దేశీయ స్టాక్ మార్కెట్లు..
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు




