త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sankranti Festival | సంక్రాంతి ఎఫెక్ట్.. ఎన్ 65పై వాహ‌నాల ర‌ద్దీ.. పంతంగి టోల్‌గేట్ వ‌ద్ద‌ భారీగా ట్రాఫిక్‌ జామ్‌

సంక్రాంతి పండుగ‌కు (Sankranti Festival) వెళ్లే వాహ‌హ‌నాల‌తో హైద‌రాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా (Heavy Traffic) పెరిగింది. హైద‌రాబాద్‌లో నివ‌సించే ప్ర‌జ‌లు పండుగ‌కు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్తున్నారు.

G

Telangana | Published On Jan 11, 2026, 8.36 am IST

Sankranti Festival | సంక్రాంతి ఎఫెక్ట్.. ఎన్ 65పై వాహ‌నాల ర‌ద్దీ.. పంతంగి టోల్‌గేట్ వ‌ద్ద‌ భారీగా ట్రాఫిక్‌ జామ్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: సంక్రాంతి పండుగ‌కు (Sankranti Festival) వెళ్లే వాహ‌హ‌నాల‌తో హైద‌రాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా (Heavy Traffic) పెరిగింది. హైద‌రాబాద్‌లో నివ‌సించే ప్ర‌జ‌లు పండుగ‌కు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్తున్నారు. ఆదివారం తెల్ల‌వారుజామున పెద్ద ఎత్తున వాహ‌నాలు రోడ్డెక్క‌డంతో.. ఒక్క‌సారిగా ఎన్‌హెచ్ 65పై (nh 65) ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో హ‌య‌త్‌న‌గ‌ర్‌, పెద్దఅంబ‌ర్‌పేట‌, చౌటుప్ప‌ల్ వ‌ద్ద వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దులుతున్నాయి. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా (Panthangi Toll Plaza) వ‌ద్ద కార్లు, ఆర్టీసీ, ప్రైవేటు బ‌స్సులు, భారీ వాహ‌నాలు బారులు తీరాయి.

ఫాస్టాగ్‌ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్‌లు స్కాన్‌ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్‌ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్‌ టోల్‌గేట్‌ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి ఆదివారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు 70 వేల వాహ‌నాలు టోల్‌గేట్ దాటిన‌ట్లు టోల్ ప్లాజా సిబ్బంది వెల్ల‌డించారు. ఆదివారం కావ‌డంతో నేడు వాహ‌నాల ర‌ద్దీ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ట్రాఫిక్‌ పోలీసులు భావిస్తున్నారు.

[video width="848" height="394" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-11-at-10.06.36-AM.mp4"][/video]

Advertisement

తాజావార్తలు

Advertisement