Nagarjuna | లూజర్ నుంచి కింగ్ – నాగార్జున వందో మూవీ గ్లింప్స్ రిలీజ్ – క్రిస్మస్‌కు థియేటర్లలోకి
నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న వందో మూవీ గ్లింప్స్ రిలీజైంది. యాక్షన్ అంశాలతో ఈ గ్లింప్స్ స్టైలిష్‌గా సాగింది. రా కార్తీక్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టబు, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Entertainment | Published On Aug 29, 2026, 12.38 pm IST
Nagarjuna | తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల్లో జోష్ నింపాడు అక్కినేని నాగార్జున. ఆయన హీరోగా నటిస్తోన్న వందో మూవీ గ్లింప్స్ రిలీజైంది. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబుతో పాటు ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
డబ్బున్నోళ్లు...
నాగార్జున బర్త్‌డే సందర్భంగా శనివారం వందో మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. మనుషుల్లో రెండు రకాలు...డబ్బున్నోళ్లు....డబ్బు లేనోళ్లు... అంటూ నాగార్జున డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. డబ్బులేనప్పుడు నన్ను లూజర్ అన్నారు. డబ్బున్నప్పుడు దే కాల్ మీ ద కింగ్ అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ గ్లింప్స్‌లో నాగార్జున స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. దేవీశ్రీప్రసాద్ బీజీఎమ్ ఈ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది.
క్రిస్మస్‌కు థియేటర్లలోకి....
నాగార్జున వందో మూవీ రిలీజ్ డేట్ ఈ గ్లింప్స్ ద్వారా కన్ఫామ్ చేశారు. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 24న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. పొలిటికల్ అంశాలతో ఈ మూవీ రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయబోతున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది.
They call me The King.. నాగార్జున 100 వ మూవీ గ్లింప్స్ అదిరింది.#King100 #Nagarjuna pic.twitter.com/2LvmzPAsn2
— Tollywoodtopics (@filmytopics) August 29, 2026
;
సంబంధిత వార్తలు

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య – రష్మిక మందన్న ఊరితో లింక్?
సెప్టెంబర్ 4, 2026

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



