Assam Doctor | జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డాక్టర్..
Assam Doctor | అస్సాంలోని నాగావ్‌లో (Assam) విషాదం చోటుచేసుకుంది. జిమ్‌లో సాధన చేస్తూ ఓ డాక్టర్ (Assam doctor) కుప్పకూలిపోయారు. అప్పటివరకు సహచరులతో మాట్లాడుతూ హుషారుగా వర్కవుట్ చేస్తున్న అతడు అంతచూస్తుండగా ప్రాణాలువదిలారు.
Assam Doctor | త్రినేత్ర.న్యూస్: అస్సాంలోని నాగావ్‌లో (Assam) విషాదం చోటుచేసుకుంది. జిమ్‌లో సాధన చేస్తూ ఓ డాక్టర్ (Assam doctor) కుప్పకూలిపోయారు. అప్పటివరకు సహచరులతో మాట్లాడుతూ హుషారుగా వర్కవుట్ చేస్తున్న అతడు అంతచూస్తుండగా ప్రాణాలువదిలారు.
డాక్టర్ షహీన్ రెహమాన్ (Dr. Sahin Rahman) నాగావ్ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రోజూలానే గత గురువారం (ఆగస్టు 27న) సాయంత్రం 7.30 గంటల సమయంలో జిమ్‌లో (Gym)వ్యాయామం చేస్తున్నారు. సహచరులతో మాట్లాడుతూ ఉల్లాసంగా కనిపించిన ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడ ఉన్నవారు వెంటనే ఆయనను దవాఖాకు తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మరణానికి గల కరణం తెలియనప్పటికీ, గుండెపోటు (Cardiac Arrest) వల్లేనని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృష్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఇటీవల కాలంలో జిమ్‌లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు తరచూ జరుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఉత్తారఖండ్‌లోని చంపావత్ జిల్లాలో 38 ఏండ్ల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) అధికారి అయిన గిరీశ్ భట్ జిమ్‌లో వర్కవుట్ చేస్తూ చనిపోయారు. గతేడాది ఆగస్టు 2న పుణెలోని చించ్వాడ్ ప్రాంతంలో మిలింద్ కుల్‌కర్నీ (37) అనే వ్యాపారవేత్త జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయారు.
ఈ నేపథ్యంలో ప్రతి జిమ్‌లో సిబ్బందికి బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS), సీపీఆర్ చేయడం తెలిసి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర సమయంలో ఏఈడీ (AED) పరికరాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని చెబుతున్నారు. మరోవైపు 40 ఏండ్లు పైబడిన వారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు భారీ వ్యాయామాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా కార్డియాక్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
🚨 ASSAM: DOCTOR DIES AFTER COLLAPSING DURING GYM SESSION
A doctor died after suddenly collapsing while exercising at a gym in Nagaon, Assam on Thursday evening, August 27.
The man was identified as Dr. Shaheen Rahman an Associate Professor in the Department of Community… pic.twitter.com/14HiO8W9Du
— contentkikamii (@contentkikamii) August 28, 2026
తాజావార్తలు
- ●ఒకే నాణేనికి మూడు ముఖాలు: ఉగ్ర-తీవ్ర-వేర్పాటువాదాల అంతరార్థంపై ప్రత్యేక కథనం!
- ●Mobile GST Reduction | స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..
- ●FSSAI | ఫుడ్ ప్యాకెట్లపై "రెడ్" వార్నింగ్.. సుప్రీంకోర్టుకు FSSAI కీలక ప్రతిపాదన
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.28వేలు తగ్గిన బంగారం ధర.. వరుస సెషన్లలో నష్టాలు..
- ●Chamala Kiran Kumar Reddy | సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీది కీలకపాత్ర: ఎంపీ చామల
- ●CM Vijay | చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు

ఒకే నాణేనికి మూడు ముఖాలు: ఉగ్ర-తీవ్ర-వేర్పాటువాదాల అంతరార్థంపై ప్రత్యేక కథనం!

Mobile GST Reduction | స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..

FSSAI | ఫుడ్ ప్యాకెట్లపై "రెడ్" వార్నింగ్.. సుప్రీంకోర్టుకు FSSAI కీలక ప్రతిపాదన

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.28వేలు తగ్గిన బంగారం ధర.. వరుస సెషన్లలో నష్టాలు..






