CM Vijay | చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) దేశంలోనే అతిపెద్ద జైలు సముదాయాల్లో ఒకటైన చెన్నై సమీపంలోని పుజల్ సెంట్రల్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆకస్మిక తనిఖీలు చేశారు.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) దేశంలోనే అతిపెద్ద జైలు సముదాయాల్లో ఒకటైన చెన్నై (Chennai) సమీపంలోని పుజల్ సెంట్రల్ జైలును ( Puzhal Central Prison) సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆకస్మిక తనిఖీలు చేశారు. జైల్లో కల్పించిన ప్రాథమిక సౌకర్యాలు, ఆహార నాణ్యత, వైద్య సదుపాయాలు, వృత్తి శిక్షణ కేంద్రాలు, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్‌ను సీఎం పరిశీలించారు. వృత్తి శిక్షణా కేంద్రంలో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను విజయ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఖైదీలతో (inmates) సీఎం విజయ్ నేరుగా మాట్లాడారు. అక్కడ అందుతున్న సౌకర్యాల గురించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు వారి సమస్యలు, అవసరాల గురించి ఆరా తీశారు. ఆ తర్వాత ఎం-3 పుజల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. అక్కడ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను స్టేషన్ పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. కాగా, గతంలో ప్రభుత్వ చిన్నారుల ఆసుపత్రిని, అనంతరం దళిత విద్యార్థుల ప్రభుత్వ హాస్టల్‌ను కూడా సీఎం ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించిన విషయం తెలిసిందే.
Also Read..
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్.. 291 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
సంబంధిత వార్తలు

CM Vijay | చెన్నైలో మెగా ఒలింపిక్ సిటీ, ఫార్ములా-1 రేసింగ్.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన
సెప్టెంబర్ 3, 2026

CM Vijay | సీఎం విజయ్ సంచలన ప్రకటన.. వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత
సెప్టెంబర్ 2, 2026

CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్
ఆగస్టు 28, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



