SBI Life Smart Scholar Plus | ఐదేళ్లు చెల్లిస్తే రూ.45 లక్షలు.. పిల్లల భవిష్యత్తుకు ఎస్‌బీఐ పథకం..
SBI Life Smart Scholar Plus | పిల్ల పుట్టిన తర్వాత తల్లిదండ్రుల జీవితంలో కొత్త బాధ్యత మొదలవుతుంది. తమ పిల్లల ఉన్నత చదువులు, వివాహం, భవిష్యత్తు కలలను నెరవేర్చడమే ప్రతి తల్లిదండ్రుల ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే ఇలాంటి ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అనేక పొదుపు పథకాలను అందిస్తోంది.
SBI Life Smart Scholar Plus | పిల్ల పుట్టిన తర్వాత తల్లిదండ్రుల జీవితంలో కొత్త బాధ్యత మొదలవుతుంది. తమ పిల్లల ఉన్నత చదువులు, వివాహం, భవిష్యత్తు కలలను నెరవేర్చడమే ప్రతి తల్లిదండ్రుల ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే ఇలాంటి ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన పథకాలలో ఎస్‌బీఐ లైఫ్-స్మార్ట్ స్కాలర్ ప్లస్ ఒకటి. పిల్లల ఉన్నత విద్య, వివాహం, భవిష్యత్తు అవసరాల కోసం నిధిని సమకూర్చుకోవడంతో పాటు, మార్కెట్ అనుసంధానిత రాబడుల ద్వారా పెద్ద మొత్తంలో నిధిని నిర్మించుకునే అవకాశం ఇందులో ఉంటుంది.
దీర్ఘకాలంలో ఫండ్ విలువ పెరిగే చాన్స్..
ఈ పథకంలో ప్రధానమైన ప్రయోజనం ప్రీమియం చెల్లింపుదారుడికి లభించే మినహాయింపు. ఒకేసారి జీవిత బీమా రక్షణ, మార్కెట్ ఆధారిత పెట్టుబడి రాబడులను అందించేలా ఈ పథకం పనిచేస్తుంది. పాలసీ కాలంలో ప్రీమియం చెల్లించే తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు మరణించినా లేదా వైకల్యానికి గురైనా కుటుంబానికి బీమా రక్షణ లభిస్తుంది. భవిష్యత్తులో చెల్లించాల్సిన మిగిలిన ప్రీమియంలను ఎస్‌బీఐ లైఫ్ కంపెనీ భరిస్తుంది. పాలసీ గడువు ముగిసే సమయానికి పిల్లల కోసం ఫండ్ అందుతుంది. ఈ పథకంలో మరో ముఖ్యమైన సౌలభ్యం.. తల్లిదండ్రులు దీర్ఘకాలం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ఐదేళ్ల పాటు నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన తర్వాత కూడా, పాలసీ కాలం ఎక్కువగా ఉంటే మరో 15 నుంచి 20 సంవత్సరాల వరకు పెట్టుబడి ఫండ్లలో కొనసాగవచ్చు. దీంతో మార్కెట్ పనితీరును బట్టి దీర్ఘకాలంలో ఫండ్ విలువ పెరిగే అవకాశం ఉంటుంది.
ప్లాన్ వివరాలు..
ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ ప్లస్ ఒక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్). ఇందులో పాలసీదారు చెల్లించే మొత్తాన్ని ఈక్విటీ, డెట్ ఫండ్లలో పెట్టుబడి పెడతారు. 15 నుంచి 20 సంవత్సరాల దీర్ఘకాలంలో మార్కెట్ సాధించే వార్షిక వృద్ధిని బట్టి ఫండ్ విలువ పెరుగుతుంది. ఐదేళ్ల పాటు ప్రతి సంవత్సరం దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, మార్కెట్ నుంచి 12 నుంచి 15 శాతం వార్షిక రాబడి లభిస్తే, మెచ్యూరిటీ సమయానికి భారీ ఫండ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా. కొన్ని సందర్భాల్లో ఇది రూ.45 లక్షల వరకు చేరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
10 రకాల ఆప్షన్లు..
తల్లిదండ్రుల రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టేందుకు ఈ పాలసీలో 10 రకాల ఫండ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం చెల్లింపుల కోసం సింగిల్ పే, లిమిటెడ్ పే లేదా రెగ్యులర్ పే వంటి వివిధ విధానాలను ఎంచుకోవచ్చు. అలాగే ఫండ్ విలువ కాలక్రమేణా పెరిగే కొద్దీ రెగ్యులర్ లాయల్టీ స్టేట్‌మెంట్ల ద్వారా పెట్టుబడి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ ప్రారంభమైన తర్వాత ఐదేళ్ల లాక్-ఇన్ కాలం పూర్తైన అనంతరం అత్యవసర ఆర్థిక అవసరాల కోసం కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే సౌకర్యం కూడా ఉంటుంది. అయితే ఇది స్థిరమైన వడ్డీని అందించే సంప్రదాయ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కాదని గుర్తుంచుకోవాలి. పాలసీ మెచ్యూరిటీ సమయంలో లభించే తుది మొత్తం మార్కెట్ పనితీరుపై ఆధారపడి మారుతుంది. కాబట్టి కేవలం ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించి రూ.45 లక్షలు పొందడం ఖాయమని భావించకూడదు. ఎంత ప్రీమియం చెల్లించాలి, ఎంతకాలం పెట్టుబడిని కొనసాగించాలి, ఆశించిన మార్కెట్ రాబడి ఎంత ఉండాలి వంటి అంశాలపై స్పష్టత కోసం ఎస్‌బీఐ లైఫ్ సలహాదారు లేదా నిపుణులను సంప్రదించడం మంచిది.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



