త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Newborns Died | అమరావతి హాస్పిట‌ల్‌లో పేలిన వెంటిలేట‌ర్‌.. ముగ్గురు నవజాత శిశువులు స‌జీవ‌ద‌హ‌నం

Newborns Died | మహారాష్ట్రలోని అమ‌రావతి (Amravati) జిల్లా మ‌హిళ‌ల‌ ద‌వాఖాన‌లో విషాదం చోటుచేసుకుంది. హాస్పిట‌ల్‌లోని న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ యూనిట్‌లో వెంటిలేట‌ర్ (Ventilator) పేలింది. దీంతో ముగ్గురు న‌వ‌జాత శిశువులు ప్రాణాలు (Newborns Died) కోల్పోయారు.

G

National | Published On Aug 24, 2026, 10.39 am IST

Newborns Died | అమరావతి హాస్పిట‌ల్‌లో పేలిన వెంటిలేట‌ర్‌.. ముగ్గురు నవజాత శిశువులు స‌జీవ‌ద‌హ‌నం
Advertisement

Newborns Died | త్రినేత్ర‌.న్యూస్‌: మహారాష్ట్రలోని అమ‌రావతి (Amravati) జిల్లా మ‌హిళ‌ల‌ ద‌వాఖాన‌లో విషాదం చోటుచేసుకుంది. హాస్పిట‌ల్‌లోని న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ యూనిట్‌లో వెంటిలేట‌ర్ (Ventilator) పేలింది. దీంతో ముగ్గురు న‌వ‌జాత శిశువులు ప్రాణాలు (Newborns Died) కోల్పోయారు. మరికొందరు గాయ‌ప‌డ్డారు.

సోమ‌వారం తెల్ల‌వారుజామున 3.30 గంటల సమయంలో ప్రభుత్వ మహిళా ద‌వాఖాన‌ మూడో అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో మంటలు చెలరేగాయి (Fire Broke Out). వెంటిలేటర్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఎన్ఐసీయూలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన‌ వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బంది లో ఉన్న శిశువులను (Newborn Babies) బయటకు తరలించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆరుగురు శిశువుల‌ను స‌మీపంలోని సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో చికిత్స అందిస్తున్నాయి. మరికొందరి పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది. ప్ర‌మాద సమయంలో NICUలో 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నార‌ని అధికారులు తెలిపారు.


కాగా, ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌త‌స్థాయి ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన‌ట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చంద్ర‌శేఖ‌ర్ బ‌వ‌న్కులే వెల్ల‌డించారు. గాయ‌ప‌డిన‌వారికి మెరుగైన వైద్య స‌హాయం అందిస్తామ‌ని చెప్పారు.

 

Advertisement
Advertisement